స్వర్ణ గ్రామ, వార్డు సిబ్బంది విధుల పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఇక నుంచి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసారు. స్వర్ణ, గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి ప్రస్తుత అవసరాలను బేరీజు వేసుకుని జాబ్ ఛార్ట్ సిద్దం చేయాలని ఆదేశించారు. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాలకు ఓ ఈవీ సైకిల్ ఇవ్వాలని నిర్దేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పాలనలో టెక్నాలజీ, పాజిటివ్ పర్సెప్షన్ అంశాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచనలు చేసారు. ఇదే సమయంలో ప్రజా సేవల విషయంలో స్పష్టత ఇచ్చారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేసారు. స్వర్ణ, గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి ప్రస్తుత అవసరాలను బేరీజు వేసుకుని జాబ్ ఛార్ట్ సిద్దం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేసారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులను ప్రజలకు సంతృప్తి కలిగేలా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, మండల స్థాయిలోనూ అధికారులు నాలుగు సార్లు గ్రామాలకు వెళ్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. ఇక తప్పనిసరిగా ఈ పర్యటనల వివరాలను కూడా ఇవ్వాలని.. అదే విధంగా మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు. ప్రతీ వారం సోమవారం ఆర్టీజీఎస్ ద్వారా క్షేత్రస్థాయిలోని అంశాలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ టెక్నాలజీ ఇంటిగ్రేషనుతో పని చేయాలని.. అన్ని రంగాల్లోనూ డీప్ టెక్ అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. డీప్ టెక్ ను వినియోగించడం ద్వారా ద్వారా అదనపు అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అధికారులకు కీలక దిశా నిర్దేశం
అదే విధంగా టెక్నాలజీతో రెవెన్యూ పెంచుకోవచచ్చు.. సంపద సృష్టించేలా ప్రణాళికలను సిద్దం చేయవచ్చని చంద్రబాబు సూచించారు. డేటా లేక్ లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచేలా చర్య లు తీసుకోవాలని... దీని కోసం ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందించాలని నిర్దేశించారు. డేటా లేక్ లో ఉన్న సమాచారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే సత్వర నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సేవలతో పాటు సంక్షేమ పథకాలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తం కావాలని స్పష్టం చేసారు. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాలకు ఓ ఈవీ సైకిల్ ఇవ్వాలని.. అదే విధంగా స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగికి ఒక్కో బాధ్యత మాత్రమే అప్పజెబు దామనే విధానం కష్ట సాధ్యమైందని పేర్కొన్నారు. కొంత మందికి ఎక్కువ పని ఉంటోంది... కొంత మందికి చాలా తక్కువ పని ఉంటోందని... దీన్ని సరి చేసి రేషనలైజ్ చేయాలని ఆదేశించారు. కాగా, పని భారం పెంచకుండా... వివిధ బాధ్యతలను అప్పచెప్పేలా చూడాలని.. ప్రతీ పంచాయితీ పరిధిలోని స్వర్ణ గ్రామ సిబ్బంది విధుల స్పష్టత కోసం జాబ్ ఛార్ట్ ఇవ్వాలని నిర్దేశించారు.












Click it and Unblock the Notifications
