వారిద్దరితో చాలా ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి - సీఎం చంద్రబాబు
టాలీవుడ్ సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బాలకృష్ణ సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి గ్రాండ్‌గా పార్టీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోచంద్రబాబుకు చెందిన ఫాంహోస్‌లో ఈ పార్టీ జరగింది.ఈ పార్టీకి తెలంగాణ సర్కార్ పటిష్ట భద్రతలను చేపట్టింది. ఈ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు నందమూరి, నారా కుటుంబ సన్నిహితులు, బంధువులందరూ హాజరయ్యారు.
అలాగే ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శక, నిర్మాతలు సైతం నారా భువనేశ్వరి ఇచ్చిన పార్టీకి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదాగా గడిపారు.ఈ సందర్భంగా అక్క చెల్లెలు అందరూ కలిసి బాలకృష్ణను ఆటపట్టించారు. భార్య వసుంధర గురించి చెప్పమంటే ఆమె నా లక్ అంటూ తెలివిగా సమాధానం ఇచ్చారు బాలయ్య. సీఎం చంద్రబాబు సైతం ఫ్యామిలీ మెంబర్స్‌తో సరదాగా గడిపారు. చంద్రబాబు మాట్లాడుతూ..బాలకృష్ణ, భువనేశ్వరిల మధ్య నలిగిపోతున్నా.

వీరిద్దరి మధ్య ఉంటే ప్రమాదమని చంద్రబాబు సరదగా వ్యాఖ్యానించారు. నిన్నటి వరకు అల్లరి బాలయ్య, ఇప్పుడు పద్మభూషన్ బాలయ్య అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకిత భావం లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టిందని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజమైన ఐకానిక్‌కు దయగల నాయకుడికి తగిన గౌరవం అంటూ సీఎం చంద్రబాబు పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ 1974లో సినిమాల్లో ఎంట్రీ ఇస్తే, తాను 1978లో తొలిసారి ఎమ్మెల్యేను అయ్యాను. ఆయన నాకంటే నాలుగేళ్లు సీనియర్ , ఆయనకి నాకంటే డెడికేషన్ ఎక్కువ అని బామర్దిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.












Click it and Unblock the Notifications