కుప్పం, పుంగనూరులో ఆపనులు చెయ్యండి, ఎంతైనా పర్వాలేదు, చంద్రబాబు ఆర్డర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరు పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పరిధిలోని కుప్పం, పుంగనూరు బ్రాంచ్ కాలువలకు సాగు నీరు రావడం లేదు. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులు పనులు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వగా అందులో హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే పుంగనూరు బ్రాంచ్ కాలువకు త్వరలోనే సాగు నీరు అందుతుందని తెలిసింది. 2014- 19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు వేగవంతం చేశారు. కర్నూలు జిల్లా నుండి ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదననల్లె, పుంగనూరు, పలమనేరు ప్రాంతాలకు సాగునీరు అందించడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

CM Chandrababu has issued orders to speed up the work of Handri Niva project

అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామకుప్పం వరకు కొంత నీళ్లు తీసుకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం హడావిడి చేసి సైలెంట్ అయిపోయింది. ఇప్పటికే పుంగనూరు బ్రాంచ్ కాలంలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని సంబంధిత అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

ఇక తంబళ్లపల్లె నియోజకవర్గం లో బ్రాంచ్ కాలువ పలుచోట్ల పూర్తిగా దెబ్బతినిందని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఈ పనులు త్వరగా పూర్తి చేయాలంటే దాదాపు రూ. వంద కోట్లకు పైగా ఖర్చు అవుతుందని సంబంధిత అధికారులు చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులకు ప్రాజెక్టు పనులు పూర్తి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, నియోజకవర్గాల్లో దాదాపు 37 వేల ఎకరాలకు ఆయకట్టు నీరు అందుతుందని అధికారులు అంటున్నారు.

CM Chandrababu has issued orders to speed up the work of Handri Niva project

ఇక కుప్పం బ్రాంచ్ కాలువ పనులు పూర్తి చెయ్యడానికి చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. కుప్పంలో కాలువ పనులకు భూములు ఇచ్చిన రైతులకు రూ. 17 కోట్లు బకాయిలు ఇవ్వాలని, హంద్రీ నీవా కాలువు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సుమారు రూ. 29 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు కూటమి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

CM Chandrababu has issued orders to speed up the work of Handri Niva project

హంద్రీ నీవా ప్రాజెక్టు పనులు పూర్తయి అయితే 110 చెరువులకు సాగు నీరు అందుతుంది. పుంగనూరు కుప్పం బ్రాంచ్ కాలవ పనులు పూర్తి అయితే కృష్ణా జలాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వస్తాయని, సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు నాలుగు లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుందని, కాలువ పనులు వేగవంతం చెయ్యాలని సీఎం చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+