ఇది నా జీవితంలో పవిత్రమైన రోజు.. చంద్రబాబు భావోద్వేగం!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పంలో కృష్ణమ్మకు జల హారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పంలో చివరి భూముల వరకు కృష్ణ జలాలు చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయన్నారు.
తన జీవితంలో పవిత్రమైన రోజు అన్న చంద్రబాబు
కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందన్నారు. తన జీవితంలో ఇది పవిత్రమైన రోజు అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు తనను ఆదరించారని గుర్తు చేశారు. కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైంది అంటూ చంద్రబాబు సంతోషంగా చెప్పారు.738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామన్నారు.

ఎన్టీఆర్ ను గుర్తు చేసుకున్న చంద్రబాబు
ఏడు వందల మీటర్లు ఎత్తుకు నీళ్లు తెచ్చామని ఆయన పేర్కొన్నారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని, అందుకే శతాబ్దాలు గడిచినా... కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదన్నారు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తు చేశారు.
శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు తెచ్చాం
పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నా అని పేర్కొన్న చంద్రబాబు చంద్రబాబు 1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశానన్నారు. ప్రస్తుతం శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చామని పేర్కొన్నారు.గంగమ్మ ఆశీర్వదించింది... కుప్పానికి కృష్ణమ్మ వచ్చిందని చంద్రబాబు ఏం చేశారు
రాయలసీమను రాళ్ళ సీమ కానివ్వను, రతనాల సీమ చేస్తా
కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించానన్నారు.రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను... రతనాల సీమ చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు.
సెట్టింగులు వేసి మభ్యపెట్టిన గత పాలకులు
గతం ఓసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయిందని ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడంలో వైసీపీ దిట్ట అన్న చంద్రబాబు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎన్టీఏ వల్లే సాధ్యం అవుతుందన్నారు.
వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
ఇప్పుడు కుప్పానికి నీళ్లు రాగానే జీర్ణించుకోలేకపోతున్నారని వైసిపి నాయకుల తీరుపై మండిపడ్డారు. బయట నుంచి నీళ్లు తెచ్చి మభ్యపెట్టడం వైసీపీకి అలవాటని,,చెరువులను నీళ్లతో నింపడం మాకు అలవాటు అని చంద్రబాబు వైసిపికి గట్టి కౌంటర్ ఇచ్చారు. కుప్పానికి కృష్ణా జలాలు రావటంతో ఆయన ఇన్నేళ్ల భగీరథ ప్రయత్నం ఫలించినట్టయింది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications