చంద్రబాబు సొంత జిల్లాలో భారీ మార్పులు, వైసీపీ హయాంలో వచ్చి మకాం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైంది. రెవెన్యూ శాఖలో పలు మార్పులు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సుమిత్ కుమార్ అధికారంతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రెవెన్యూ శాఖలో ప్రక్షాళన కోసం త్వరలోనే వీఆర్వోలు, డీటీలు తదితర సిబ్బంది బదిలీలు చేస్తామని, నిబంధనల మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలు కూడా చేపడతామని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. చిత్తూరు-తచ్చూరు హైవే నిర్మాణం కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.

CM Chandrababu is making huge changes in the revenue department in his own district

ఈ దస్త్రాలను త్వరగా పూర్తి చేయాల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లాలో యుద్ధ ప్రతిపాదికన సీసీ రోడ్లు, గోశాలల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అందుకోసం ఇప్పటికే అవసరమైన రూ 90 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కుప్పం, చిత్తూరులోని కేంద్రీయ విద్యాలయాల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభమవుతాయని సుమిత్ కుమార్ స్పష్టం చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ 130 కోట్ల రూపాయలతో ఉపాధి హామీ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం మెనూ మార్పు విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు, కమిటీ సభ్యుల నుంచి సలహాలు తీసుకుంటామని, వారు సూచనలతో మెనూ సిద్ధం చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో రెవెన్యూ శాఖలో ప్రక్షాళన మొదలైయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో పలు ప్రాంతాల్లో విధులు దుర్వినియోగం చేసి ఇప్పుడు కూడా అదే ప్రాంతాల్లో మకాం వేసిన ఆ శాఖ ఉద్యోగులకు దడ మొదలైయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+