ఢిల్లీకి చంద్రబాబు- కేబినెట్ లో టీడీపీకి మరో బెర్తు, ఆయనకే..కీలక నిర్ణయాలు..!!
ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల తొలి వారంలోనే ఈ బిల్లులను ఆమోదించేలా వ్యూహాలు సిద్దం చేస్తోంది. అదే విధంగా ఈ నెల చివరి వారంలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కు రంగం సిద్దం అవుతోంది. ఈ కీలక పరిణామాల వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి మరో బెర్తు ఖాయమైందని సమాచారం.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు (మంగళవారం) చంద్రబాబు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో వరుస తుఫాన్లతో జరిగిన నష్టం పైన కేంద్రంతో చర్చించనున్నారు. రాష్ట్రానికి మద్దతుగా నిలవాలని కోరే అవకాశం ఉంది. అదే విధంగా కేంద్రం రానున్న 15 రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 25,26 తేదీల్లో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు మంత్రు లు ఉన్నారు. ఏపీకి మరో కేబినెట్ బెర్తు ఖాయమని తెలుస్తోంది. టీడీపీకే ఆ మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. అందులో భాగంగా సామాజిక- ప్రాంతీయ సమీకరణాల్లో భాగంగా ఈ సారి మంత్రి పదవి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి దక్కే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం ఉంది.

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు
అదే విధంగా వచ్చే నెల తొలి వారంలో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ తో పాటుగా డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ లో ఇదే బిల్లు పూర్తి మెజార్టీ లేక వీగిపోయింది. దీంతో.. ఈ సారి పూర్తి మెజార్టీ లెక్కలు సరి చేసుకొని కేంద్రం ఈ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకొస్తోంది. ఇండి కూటమిలోని కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎన్సీపీ, డీఎంకే నుంచి షరతులతో ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ లెక్కలు అనుకున్నట్లుగా జరిగితే బిల్లు ఆమోదం తో పాటుగా మరో 15 వరకు అదనపు ఎంపీల మద్దతు దక్కనుంది. దీంతో.. ఈ కీలక పరిణామాల వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారుతోంది. పాలనా పరమైన అంశా లతో పాటుగా రాజకీయ వ్యవహారాల పైన కేంద్రంతో చంద్రబాబు చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications
