కుప్పంకు బంఫర్ ఆఫర్, కర్ణాటక, తమిళనాడు బార్డర్ లో ఆ ఫ్యాక్టరీలు, సూపర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజక వర్గం కుప్పంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వరుసగా తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పం ప్రజల రుణం తీర్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, ఆ దిశగా ఆయన చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని, కుప్పం ప్రజల సమస్యలు తీర్చడానికి సీఎం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది.

కుప్పం ప్రజలు ఊహించని విదంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలకి హామీ ఇచ్చారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పంలో ఏపీఐఐసీ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీఐఐసీ అధికారులతో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీధర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఏపీఐఐసీ అధికారులతో చర్చించారు.

CM Chandrababu is taking steps to set up industries in Kuppam constituency

కుప్పం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, ఆ దిశగా అధికారులు చర్చలు జరపాలని తనకు సూచించారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధికారులకు చెప్పారు. కుప్పం మండలంతో పాటు ఆ నియోజక వర్గంలోని ప్రతి మండలంలో ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు, మహిళలకి ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధికారులకు చెప్పారు.

కుప్పం తో పాటు ఆ నియోజక వర్గంలోని ప్రతి మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భూములు పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడు తనకు సూచించారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు శాంతిపురం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పంలో భూములను పరిశీలించి పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందో అంటూ నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు.

టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారని, ఆ దిశగా సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని అటవి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మహిళల కోసం టెక్స్ టైల్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని, భూములు పరిశీలించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ అధికారులకు చెప్పారు.

ఏపీఐఐసీ అధికారులు వెంటనే భూములు పరిశీలించిన వేదిక తయారు చేయాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ సంబంధిత అధికారులకు సూచించారు. ఏపీఐఐసీ అధికారులు ఎమ్మెల్సీ శ్రీకాంత్ తో సమావేశం అయ్యారు. కుప్పం నియోజక వర్గంలో టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రముల ఏర్పాటు చెయ్యడానికి ఇటీవల కొందరు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+