ఓ అడుగు ముందే ఉన్న చంద్రబాబు: ఆయన విజన్ చాలా గొప్పది
Chandrababu: మరాఠా గడ్డపై మరోసారి భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. మధ్యాహ్నానికి ఈ కూటమి అభ్యర్థులు 51 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో 175 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఆరు సీట్లల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 47 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
దాదాపుగా ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ మహాయుటి దూకుడు కొనసాగింది. కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
Congratulations to the Mahayuti Alliance on securing a historic mandate in Maharashtra. This victory reflects people's continued trust in the leadership of the Hon'ble Prime Minister Shri @narendramodi Ji, whose strategic vision, transformative policies and devotion to the people… pic.twitter.com/u40WTplSyh
— N Chandrababu Naidu (@ncbn) November 23, 2024
శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు సారథ్యాన్ని వహిస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన చీలిక వర్గ ఎన్సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులనే మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తోన్నారు.
మహాయుటి సాధించిన ఈ విజయం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కూటమికి శుభాకాంక్షలను తెలియజేశారు. మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా తిరుగులేని విజయాన్ని మహాయుటి దక్కించుకుందని కితాబిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు బలంగా కోరుకుంటోన్నారనే విషయం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని చంద్రబాబు అన్నారు. ఆయన వ్యూహాత్మక విజన్, ప్రజలు- దేశాభివృద్ధి పట్ల అకుంఠిత చిత్తశుద్ధితో వికసిత్ భారత్ సాధ్యపడుతుందని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications