నిద్రపోని చంద్రబాబు: తెల్లవారు జామునే రివ్యూలతో బిజీ
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో దంచికొట్టిన అతి భారీ వర్షాల తీవ్రత ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరింత పెరుగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం ప్రకాశం బ్యారేజీ తీవ్రంగా పడింది.
అటు బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

వాటి తీవ్రత ప్రకాశం బ్యారేజీపై పడింది. ఇన్‌ఫ్లో తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులుగా నమోదైంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా విడుదల చేస్తోన్నామని వివరించింది.
వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించారు. ఆదివారం విజయవాడలో పలు ప్రాంతాల్లో బోటులో పర్యటించారు. వరద తీవ్రతను స్వయంగా తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల బాధితులతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు.

రాత్రి విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బస చేశారు. తన బస్సును అక్కడే పార్క్ చేశారు. అక్కడే అధికారులతో సమీక్ష చేపట్టారు. వరద తీవ్రత తగ్గేంత వరకూ ఇక్కడే ఉంటానంటూ భరోసా ఇచ్చారు. సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తానని అన్నారు.
వరద సహాయక చర్యలపై సీఎం రివ్యూ. ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు గారు సమావేశం. ఆహారం, బోట్లు ఎంతవరకు వచ్చాయనే సమాచారంపై ఆరా. సింగ్‌నగర్ లో ప్రస్తుత పరిస్థితి, సహాయంపై సీఎం సమీక్ష. తెల్లవారుజాము నాలుగు గంటల వరకు జిల్లాలోని వరద ప్రాంతాల్లో సాగిన సీఎం పర్యటన#APGovtWithFloodVictims… pic.twitter.com/nfN03YUpW9
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు మళ్లీ అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు చంద్రబాబు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇందులో పాల్గొన్నారు. జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గుమ్మళ్ల సృజన, విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇందులో పాల్గొన్నారు.
ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చా. హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాగం పనిచేయాలి. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయి. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలి. ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదు. విపత్తు సమయంలో వరద… pic.twitter.com/98ak7VqmUE
— Telugu Desam Party (@JaiTDP) September 2, 2024
కృష్ణానదికి ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలు, వస్తోన్న వరద తీవ్రత, ఇతర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తోన్న వరద నీటి పరిణామం గురించి ఆరా తీశారు.
ప్రకాశం బ్యారేజీ తీరంలో నివసిస్తోన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, విజయవాడలో వరద ముంపునకు గురైన కాలనీల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, శిబిరాల్లో తలదాచుకుంటోన్న వారికి అందజేస్తోన్న ఆహారం, దినసరి వస్తువులపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications