చంద్రబాబు ఇంటికి ముంపు భయం?
Heavy rains in AP: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.
శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఇన్ ఫ్లో 3,56,024 క్యూసెక్కులు. కాగా అవుట్ ఫ్లో 5,00,397 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,61,245 మేర ఉండగా.. అవుట్ ఫ్లో 4,53,700 క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3,39,434, ఔట్ ఫ్లో 3,14,434 క్యూసెక్కులు ఉంటోంది.
అటు ప్రకాశం బ్యారేజీ వరద ఉదృతి కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా- అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తివేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు.
దీని ప్రభావం వల్ల ఉండవల్లి వద్ద కృష్ణా నది తీరంలో నిర్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వరద ముంపు భయం నెలకొంది. ఏ క్షణంలోనైనా వరదనీరు ఆయన ఇంట్లోకి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కృష్ణానదికి సంభవించిన వరద సమయంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే.
అప్పట్లో ప్రకావం బ్యారేజీ గేట్లకు బోటును అడ్డం పెట్టారంటూ అప్పట్లో చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే ఏర్పడింది. బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు విడుదల చేస్తోన్న నేపథ్యంలో వరద నీరు ఇంటిని చుట్టుముట్టవచ్చనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications