ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి, ప్లాన్ చేసిన చంద్రబాబు, పెద్దిరెడ్డి పెత్తనానికి బ్రేక్

ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి, కర్ర విరగకూడదు, పాము చావకూడదు ఇలాంటి సామెతలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో అక్షరాలా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించిన తరువాత చిత్తూరు జిల్లా రాజకీయాల ముఖం చిత్రం మారిపోతా ఉంది.

ఇంతకాలం వైసీపీలో నెంబర్ టూ గా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి సినిమా చూపించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారని తెలిసింది. గత ఏడాది ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అన్యమయ్య జిల్లా అంగళ్లు (ఉమ్మడి చిత్తూరు జిల్లా) నుంచి పుంగనూరు మీదుగా వెలుతున్న సమయంలో పుంగనూరులో జరిగిన గొడవలకు కారణంగా చంద్రబాబు నాయుడు అప్పట్లో రగిలిపోయారు.

CM Chandrababu Naidu planned to hit Peddireddy on the occasion of Kuppam tour

అప్పటి పుంగనూరు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆదేశాలతో వందల మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు నాయుడి మీద కూడ కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రి పదవిలో ఉండటంతో పోలీసు అధికారులు సైతం ఆయన చెప్పినట్లు విన్నారు. అయితే ఆ సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నాయకులు ఏం చెయ్యలేకపోయారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 45 వేలకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు సొంతం చేసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మంత్రి అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి పుంగనూరు ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా విజయం సాధించారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లే ఎమ్మెల్యేగా గెలిచారు.

పాత విషయాలు గుర్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పం పర్యటన సందర్బంగా చక్రం తిప్పారు. కుప్పంలో కాకుండా గుడుపల్లె కేంద్రంగా చంద్రబాబు నాయుడు పుంగనూరు టీడీపీ నాయకులతో మంతనాలు జరిపారు. పుంగనూరు టీడీపీ ఇన్ చార్జ్, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చల్లా రామచంద్రా రెడ్డి అలియాస్ చల్లా బాబుతో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారని తెలిసింది.

పెద్దిరెడ్డి నియోజక వర్గంలో పుంగనూరు ఒక్కటే మునిసిపాలిటీ. పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టడానికి పుంగనూరు మునిసిపాలిటీనే టార్గెట్ చేసుకున్న చంద్రబాబు అనుకున్నది సాధించారు. పెద్దిరెడ్డి ఆశీస్సులతోనే ఆలీంబాషా పుంగనూరు మునిసిపల్ ఛైర్మన్ అయ్యాడు. ఇప్పుడు అదే మున్సిపల్ ఛైర్మన్ ఆలీంబాషా నోటీతోనే పెద్దిరెడ్డి ఓ నియంత అని చెప్పించడంలో టీడీపీ నాయకులు సక్సస్ అయ్యారు.

CM Chandrababu Naidu planned to hit Peddireddy on the occasion of Kuppam tour

పుంగనూరు మునిసపల్ ఛైర్మన్ గా ఆలీంబాషాతో పాటు 11 మంది వైసీపీ కౌన్సిలర్లు రాజీమానా చెయ్యడంతో పెద్దిరెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యింది. పేరుకు మాత్రమే నేను మునిసిపల్ ఛైర్మన్, పెత్తనం మొత్తం పెద్దిరెడ్డి కుటుంబానిదే అంటూ ఆలీంబాషా బహిరంగ ఆరోపణలు చేశారు. ఇంతకాలం తెలుగుదేశం జెండా పట్టుకుని వెళ్లాలంటే భయపడే టీడీపీ నాయకులు ఇప్పుడు పెద్దిరెడ్డికి దెబ్బ కొట్టడానికి ఏకంగా పుంగనూరు మునిపల్ ఛైర్మన్ ఆలీంబాషాతో పాటు 11 మంది వైసీపీ కౌన్సిలర్లతో రాజీనామా చేయించారు.

పుంగనూరులో మొదటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పోరాటం చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్ తో పాటు ఇప్పుడు టీడీపీ నాయకులు అందరూ పెద్దిరెడ్డి పతనాకి పక్కాప్లాన్ చేస్తున్నారు. పుంగనూరు మునిసిపాలిటిని సొంతం చేసుకుంటున్న టీడీపీ ఇప్పుడు ఆ నియోజక వర్గంలోని మిగిలిన నాయకులను సైతం టీడీపీలో చేర్చుకుని పెద్దిరెడ్డిని ఇంకా దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే చల్లా రామచంద్రా రెడ్డి పక్కా వ్యూహంతో మొదటి నుంచి టీడీపీలో ఉంటున్న పుంగనూరు రాజుల ఫ్యామిలీలు మొత్తం పెద్దిరెడ్డిని ఇంకా దెబ్బ కొట్టాలని పక్కాగా ఆలోచిస్తున్నారు. పుంగనూరు మునిసిపాలిటీ వైసీపీ చేతులు జారిపోయినా ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కాని, వైసీపీ నాయకులు కాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఇక మదనపల్లె మునిసిపాలిటీ మీద టీడీపీ కన్ను వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+