ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. రూ.12,500 ఇస్తారు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ
పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంటలకు గిట్టుబాటు ధరలను అందించడంతో పాటు రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల పడుతున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలపై దృష్టి పెట్టి వారి వివరాలు సేకరించాలని సూచించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు- గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. పొగాకు, మిరప, కోకో పంటల గిట్టుబాటు ధరలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పొగాకు సాగు నియంత్రణ, కోకో పంటకు ప్రత్యేక విధానం, మిర్చిలో నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని.. పొగాకు ఉత్పత్తిని కంపెనీలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బర్లీ పొగాకును క్వింటాల్ కు రూ. 12,500 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అలాగే కోకో గింజలను కూడా కిలోకు రూ. 500 తగ్గకుండా కొనుగోలు చేయాలని సీఎం ఆయా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాక రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఖరీఫ్ నుంచి సన్న రకాలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. మిర్చి పంటతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

ఇక బర్లీ పొగాకును క్వింటాల్‌కు రూ.12,500 చెల్లించి కంపెనీలు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో చంద్రబాబు స్పష్టంచేశారు. ఈ మేరకు జీపీఐ, ఐటీసీ కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుల ఇళ్లల్లోనూ, పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు మిగిలి పోకూడదన్నారు. తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
మరోవైపు ఇవాళ కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కర్నూలు సీ క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించనున్నారు. అలాగే కేంద్రీయ విద్యాలయ వద్ద స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర పార్క్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications