బాలయ్య - కొరటాల మూవీకి ముహూర్తం ఫిక్స్.. చీఫ్ గెస్ట్ గా సీఎం చంద్రబాబు
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది "అఖండ 2" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టారు. ప్రస్తుతం గతంలో 'వీరసింహారెడ్డి' వంటి మాస్ హిట్ అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే మరో మూవీ చేస్తున్నారు. NBK 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మరోసారి తమన్ సంగీతం అందించబోతున్నారు.
ఈ క్రమంలోనే తన నెక్స్ట్ చిత్రాన్ని డైరెక్టర్ కొరత శివతో కమిట్ అయ్యారు బాలయ్య. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొనగా.. ఒక్కో అప్డేట్ సినిమాపై హైప్‌ను మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో హీరోయిన్ ఎంపికపై ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా NBK112 (వర్కింగ్ టైటిల్) తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు షాట్ వేదిక, సమయం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి జూన్ 25, గురువారం నాడు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్టు సమాచారం. సాధారణంగా సినిమాల ముహూర్తాలు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధిలో లేదా ప్రైవేట్ స్టూడియోల్లో జరుగుతుంటాయి. కానీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన టీటీడీ (TTD) శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈ చిత్ర ప్రారంభోత్సవానికి వేదికగా ఎంచుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ సినిమా ముహూర్తపు వేడుక కేవలం సినిమా ఈవెంట్‌లా కాకుండా, ఒక భారీ పండగలా సాగనుందని సమాచారం. నందమూరి, నారా కుటుంబాల నుంచి అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రానున్నారని టాక్ వినిపిస్తుంది.
మరోవైపు బాలకృష్ణకి జోడీగా బాలీవుడ్ స్టార్ Vidya Balan ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నిజమైతే దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమె మళ్లీ బాలకృష్ణతో స్క్రీన్ పంచుకోబోతున్నారు. గతంలో 'NTR బయోపిక్'లోని 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో వీరి కాంబినేషన్‌కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో ఉండే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట.












Click it and Unblock the Notifications