అక్కినేని అభిమానులకు బిగ్ షాక్.. "లెనిన్" మళ్లీ వెనక్కి !!

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం 'లెనిన్'పై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుని సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.

జూన్ 25 నుంచి జూలై 10కు వాయిదా

వాస్తవానికి 'లెనిన్' సినిమాను జూన్ 25న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని జూలై 10కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సినిమా వాయిదా అంటే అభిమానులు నిరాశ చెందుతారు. కానీ 'లెనిన్' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. రిలీజ్‌ను వాయిదా వేయడానికి కారణం తెలుసుకున్న తర్వాత అభిమానులు కూడా చిత్ర బృందం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

akkineni-akhil-lenin-movie-postponed-from-june-25th-to-july-10-and-nagarjuna-post-got-viral

ఔట్‌పుట్ కోసం కాంప్రమైజ్ చేయని టీమ్

సినిమా వాయిదా వెనుక అసలు కారణాన్ని అక్కినేని నాగార్జున స్వయంగా వెల్లడించారు. చిత్ర బృందం తన వద్దకు వచ్చి, సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి కొంత సమయం కావాలని కోరిందని ఆయన తెలిపారు. "లెనిన్ టీమ్ నా దగ్గరకు వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ చేసింది. ఔట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, వంద శాతం శ్రమ పెట్టి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని అందించడానికి మరికొంత సమయం కావాలని కోరారు. వారిలో ఉన్న ఆ కసి, సినిమాపై ఉన్న అంకితభావం చూసి నేను కాదనలేకపోయాను" అంటూ నాగార్జున పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతే కాకుండా రిలీజ్ వాయిదా ప్రకటనతో పాటు అఖిల్ అభిమానులకు నాగార్జున ఒక పెద్ద హామీ కూడా ఇచ్చారు. "మనోడు జూలై 10న వస్తున్నాడు. నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా... ఈసారి మీరు వెండితెరపై ఒక సరికొత్త అఖిల్‌ను చూడబోతున్నారు" అంటూ నాగ్ ధీమా వ్యక్తం చేశారు. నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. 'లెనిన్' అఖిల్ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్ మూవీగా నిలవబోతోందనే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మాస్ అవతార్‌లో అఖిల్

ఇప్పటి వరకు అఖిల్ చేసిన చిత్రాలతో పోలిస్తే 'లెనిన్'లో ఆయన పూర్తిగా కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్, మరింత మాస్ అప్పీల్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్‌లోనే అఖిల్‌ను చూసిన అభిమానులు ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో అఖిల్ థియేటర్లలో రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

'ఏజెంట్' తర్వాత కీలకమైన ప్రాజెక్ట్

అఖిల్ చివరిగా 'ఏజెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో 'లెనిన్' ఆయన కెరీర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత అఖిల్ వెండితెరపైకి వస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 'ఏజెంట్' తర్వాత సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా? అన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో నెలకొంది. ఈ ప్రశ్నలకు సమాధానం జూలై 10న థియేటర్లలో దొరకనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+