మనం తెలుగు వాళ్లు అని గొప్పగా చెప్పుకునే రోజులు త్వరలో వస్తాయి, చంద్రబాబు, పవన్ కల్యాణ్
మాతృభాషను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క తెలుగు వాడు కృషి చేయాలని, మన తెలుగు భాషను మర్చిపోతే తెలుగు జాతి కనుమరుగు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి వారసత్వ సంపద కూచిపూడి అని, ఆ కూచిపూడి ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు బాష, తెలుగు జాతి గొప్పదనం గురించి మాట్లాడారు. జీవితంలో ఎదగాడానికి ఆంగ్లం మాత్రం ముుఖ్యం కాదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. జీతం తీసుకోవడానికి ఆంగ్ల భాష అవసరమని, జీవితం తెలుసుకోవడానికి తెలుగు భాష నేర్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.

భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే అని, తెలుగు భాషను కాపాడటానికి తన శక్తి వంచన లేకుండా పని చేస్తానని, తెలుగు జాతిని కాపాడటానికి మనమందరం కచ్చితంగా తెలుగు భాష నేర్చుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2047 నాటికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, ప్రతి తెలుగువాడు గర్వంగా నేను తెలుగు వాడిని అని చెప్పు కునేలా చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఆంగ్ల భాష పైన మమకారంతో తెలుగు భాషను నిర్లక్ష్యం చేసిందని, మనం తెలుగు మర్చిపోతే తెలుగువాడి మనుగడ కాపాడుకోవడం చాలా కష్టమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీవో నెంబర్ 77 పై అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తెలుగు భాష గురించి, తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. నేను తెలుగువాడు అని అందరూ గొప్పగా చెప్పుకునే రోజులు త్వరలో వస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే సమావేశంలో పలువురు తెలుగు భాషా పండితులు కూడా ప్రసంగించారు.












Click it and Unblock the Notifications