చంద్రబాబులో ఎంత మార్పు?: కార్యకర్తలతో నవ్వులు పూయించారు

అమరావతి: రాష్ట్ర విభజన అనంతరం ప్రజల్లో స్తబ్ధత నెలకొందని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన టీడీపీ శిక్షణా తరగతులకు ఆయన మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

నాయకత్వంపై కార్యకర్తలు ప్రజలకు నమ్మకం కలిగించాలని, ప్రజల్లోకి నేరుగా వెళ్లేది కార్యకర్తలే అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ శిక్షణా తరగతులకు నిర్వహిస్తున్నామని చెప్పారు. నాయకత్వ లక్షణాలపై నేతలకు శిక్షణ ఇస్తామని తెలిపారు.

గుడ్ గవర్నెన్స్‌తో మంచి ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. వినూత్న ఫలితాలు రాబట్టేందుకు మంచి ప్రణాళికలు అమలు చేయాలని, భవిష్యత్‌లో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళికలు రూపొందించాలని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తన్నట్లు ఆయన వివరించారు.

CM Chandrababu Naidu Suggests Cell Phones And ipads For Leaders At Workshop

విభజన చట్టంలో కొన్ని అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చారని, మరికొన్నింటిని పరిశీలిస్తామని కేంద్రం పేర్కొందని కార్యకర్తలకు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోందని అన్నారు. హోదా వల్ల వచ్చే అన్ని ప్రయోజనాలతో ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని ఆయన తెలిపారు.

ఇప్పటికే కేంద్రం కొన్ని ప్రతిష్టాత్మక సంస్ధలను ప్రకటించిందని, మరిన్ని రావల్సి ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన సంస్థలు పూర్తి కావాలంటే పది వేల కోట్లు అవసరమవుతాయని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా 100 శాతం నిధులు ఇస్తామని కేంద్రం ఒప్పుకుందని వివరించారు.

అందుకే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని అన్నారు. 2018 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరంపై ముంపు ప్రాంతాలను ఏపీలో కలుపుతూ తొలి కేబినెట్‌ సమావేశంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని బాబు అన్నారు.

కాగా కార్యకర్తలకు ఐపాడ్‌, సెల్‌ఫోన్ తప్పనిసరి అని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్‌ అయితేనే ఇక్కడి నుంచి వెళతారని, లేకపోతే మరో రెండు రోజులు ఇక్కడే ఉంటారని చంద్రబాబు నవ్వులు పూయించారు. దీనివల్ల పనులు తొందరగా అవుతాయని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+