చెత్త: ఇంత పెద్ద ఇల్లుండి.. వైసిపి ఎంపీపై చంద్రబాబు అసహనం
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంటి ఎదుట ఉన్న చెత్తను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు ఇటీవల ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నెల్లూరు గాంధీ నగర్ వీధుల్లో వెళ్తున్నారు. అక్కడ ఓ ఇంటి వద్ద... ఈ ఇల్లు ఎవరిదని ఒకరిని చంద్రబాబు అడిగారు. అది ఎంపీ మేకపాటిదని చెప్పారు. దీంతో, చంద్రబాబు... ఇంత పెద్ద ఇల్లు కట్టారని, శుభ్రత పాటించకుంటే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు.

ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలం కార్పొరేషన్‌దని తెలుసుకొని ఆయన, అక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని కమిషనర్‌ను ఆదేశించారు. నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, ఓ కొబ్బరి బోండాల వ్యాపారిని, మరో బాలికను, ఓ ఆటో డ్రైవర్‌ను ఆత్మీయంగా పలకరించారు.












Click it and Unblock the Notifications