రెబల్స్ పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఎన్నికల వేళ మంత్రులకు బిగ్ టాస్క్..!!
స్థానిక ఎన్నికల్లో కూటమి రెబల్స్ పైన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి పార్టీల అభ్యర్ధులకు పోటీగా బరిలో నిలిచిన రెబల్స్ పైన చర్యలకు సిద్దమయ్యారు. మిత్రధర్మం పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఫలితాల పైన మంత్రులకు బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు. మంత్రులు తమ నియోజకవర్గాలో పాటుగా ఇంఛార్జ్ గా ఉన్న జిల్లాల్లోనూ కూటమి అభ్యర్ధుల గెలుపు బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు.
ఏపీ కేబినెట్ సమావేశం హైబ్రీడ్ విధానంలో నిర్వహించారు. ఆర్నాబ్ తుఫాను పైన అధికారుల నివేదిక పైన చర్చించారు. కేంద్రం నుంచి వచ్చిన స్పందన పైనా వివరించారు. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిందే... ఇందులో రెండవ ఆలోచనకు ఆస్కారం లేదని సీఎం చెప్పారు. పోటీలో ఉన్న అభ్యర్ధిని కాదని.. ఎన్డీఏ కూటమిని చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో జిల్లాల వారీగా రెబల్స్ పైన కీలక చర్చ జరిగింది. మూడు పార్టీలు కలిసి చర్చించి సీట్లు సర్దుబాటు చేసామని.. అభ్యర్ధులను గెలిపించాలి అని కోరామని గుర్తు చేసారు. మంచి మెసేజ్ ప్రజలకు అభ్యర్థులకు, పార్టీ కేడర్ కు, నేతలకు, ప్రజలకు పంపామని చెప్పుకొచ్చారు. ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం పై ప్రజలలో మంచి సానుకూలత ఉందని సీఎం వివరించారు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్న పవన్ కళ్యాణ్ మనం ముగ్గురం కూర్చుని మంచి మెసేజ్ ఇచ్చామని.. ప్రజల నుంచి పార్టీ కేడర్ నుంచి కూడా మంచి స్పందన వచ్చింది అని చెప్పుకొచ్చారు.

మంత్రులకు చంద్రబాబు కీలక బాధ్యతలు
అదే విధంగా జనసేన, బీజేపీ నుంచి ఉన్న చిన్న చిన్న సమస్యలను కూడా పరిస్కరిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. పార్టీ తరపున ఎక్కడైనా రెబల్స్ ఉంటే వెంటనే వాళ్లను సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రెబల్స్ గా పోటీలో ఉన్న వాళ్లు పార్టీ నుంచి సస్పెండ్ అయినట్టే భావించాలి అని తేల్చి చెప్పారు. మంత్రులు తమ నియోజకవర్గాల తో పాటు ఇంచార్జి లు గా ఉన్న జిల్లాలు పై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత మంత్రులదే అని చంద్రబాబు స్పష్టం చేసారు. పట్టణ స్థానిక సంస్థలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ల ఎన్నికలు పూర్తి అయిన తరువాత పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సీఎం వెల్లడించారు. ఆ వెంటనే సొసైటీ ఎన్నికలు కూడా ఉంటాయి అని చెప్పారు. ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆ తర్వాత మొత్తం పాలనపై దృష్టి పెడదాం అని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలలో ఎక్కడైనా వివాదాలు ఉంటే వెంటనే సెటిల్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు.













Click it and Unblock the Notifications
