కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా- కొండా సురేఖ, కీలక మలుపు...!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ తాజా నిర్ణయం ఆసక్తిగా మారుతోంది. కాంగ్రెస్ లోనే కొనసాగుతామని కొండా దంపతులు స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల కోసం రాజకీయంగా అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆకస్మికంగా కొండా సురేఖ గతంలో కేటీఆర్ పైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పైన స్పందించారు. ఆ వ్యాఖ్యల పైన చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో, ఈ పరిణామం ఒక్క సారిగా రాజకీయంగా చర్చకు కారణమైంది.

మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్ చేసారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ను ఉద్దేశించి సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇప్పుడు సురేఖ ఈ వ్యాఖ్యల పైన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివాదానికి ముగింపు పలికేలా సురేఖ ప్రయత్నించారు. నాడు తాను చేసినవి నిరాధారమైన వ్యాఖ్యలని అంగీకరిస్తూ విచారం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలనుకుంటున్న ట్లు స్పష్టం చేసిన కొండా సురేఖ, అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యానే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. "అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలు చేశాను. అంతే తప్ప అవి ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావని... ఆనాడు నేను చేసిన నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా పాదయాత్ర..!!
హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా పాదయాత్ర..!!
konda-surekha-withdraws-her-past-remarks-against-ktr-in-tweet-amid-political-controversy

కొండా సురేఖ ట్వీట్ తో వివాదం ముగిసినట్లేనా..!

దీనికి కొనసాగింపుగా.." నా వ్యాఖ్యలు వారిని, వారి కుటుంబ సభ్యులను నొప్పించి ఉంటే తీవ్రంగా చింతిస్తున్నాను. అప్పుడు నేను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుంటు న్నాను." అని కొండా సురేఖ ట్వీట్ చేసారు. కొండా సురేఖ నాడు కేటీఆర్ లక్ష్యంగా తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు చేసారు.ఆ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపడమే కాకుండా, కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పార్టీల మధ్య పెద్ద యుద్ధానికే దారితీశాయి. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించడమే కాకుండా, లీగల్ నోటీసులు కూడా పంపారు. అటు అధిష్టానం వద్ద కూడా ఈ వ్యవహారం చర్చకు రావడంతో, చివరకు కొండా సురేఖ బహిరంగంగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ 'ఎక్స్' వేదికగా క్షమాపణలు కోరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+