రోజుకు 654 ఉద్యోగాలు గోవిందా! బయటపడిన సంచలన రిపోర్ట్

గ్లోబల్ ఐటీ ప్రపంచాన్ని 'లేఆఫ్స్' భయం నీడలా వెంటాడుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం ముప్పు, సాంకేతిక మార్పులతో పాటు కస్టమర్ డిమాండ్లకు అనుగుణంగా రీస్ట్రక్చరింగ్ పేరుతో బహుళ జాతి టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా వెలువడిన అంతర్జాతీయ గణాంకాల ప్రకారం, టెక్ విభాగంలో ఈ ఏడాది ఇప్పటివరకు వందలాది కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించి లక్షలాది మందికి బిగ్ షాక్ ఇచ్చాయి. నిత్యం వందల సంఖ్యలో జాబ్స్ ఊడిపోతుండటంతో ఐటీ ఉద్యోగుల్లో భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి, ఆందోళన నెలకొన్నాయి.

గణాంకాలతో 'ట్రూఅప్' నివేదిక బాంబు

అంతర్జాతీయ టెక్ పరిశ్రమ ఉద్యోగ మార్కెట్‌ను పర్యవేక్షించే ప్రముఖ గ్లోబల్ డేటా ప్లాట్‌ఫామ్ 'ట్రూఅప్' (TrueUp) ఇటీవల ఒక దిగ్భ్రాంతికర నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 674 కంపెనీలు తమ మానవ వనరులను తగ్గించుకున్నాయి. ఈ ఊచకోతలో దాదాపు 1,97,640 మంది తమ పింక్ స్లిప్పులు అందుకొని రోడ్డున పడ్డారు. దీని ఆధారంగా చూస్తే సగటున రోజుకు దాదాపు 654 మంది టెక్ ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతుండటం గమనార్హం. 2025 క్యాలెండర్ ఏడాదిలో కూడా రోజుకు సగటున 674 ఉద్యోగాలు ఊడిపోయిన విషయం విదితమే.

Global Tech Layoffs Spurt TrueUp Report Reveals 654 Daily Job Losses Amazon and Microsoft Issue Pink Slips
డిసెంబర్ 15 వరకు కొత్త జాబ్ వెతుక్కోండి.. టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్!
డిసెంబర్ 15 వరకు కొత్త జాబ్ వెతుక్కోండి.. టెక్ ఉద్యోగులకు బిగ్ షాక్!

అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థల్లోనూ కోతలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ , టెక్ దిగ్గజమైన అమెజాన్ కూడా ఈ లేఆఫ్స్ పరంపరను కొనసాగిస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తాజాగా మరొక విడతగా 250 మందికి లేఆఫ్స్ ప్రకటించి ఇంటికి పంపించింది. మరోవైపు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా వ్యయ నియంత్రణలో భాగంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సంస్థలోని దాదాపు 60,000 మంది ఉద్యోగులకు వాలంటరీ బైఅవుట్ ఆఫర్‌ను ప్రతిపాదించింది.

Samsung Layoffs: కొత్త ఆఫీస్ తెరిచిన ఏడాదికే.. ఏఐ తెచ్చిన ముప్పు
Samsung Layoffs: కొత్త ఆఫీస్ తెరిచిన ఏడాదికే.. ఏఐ తెచ్చిన ముప్పు

మారుతున్న సాంకేతికత.. అనిశ్చితిలో ఐటీ భవిష్యత్తు

ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , ఆటోమేషన్ వాడకం విపరీతంగా పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కంపెనీల ఆదాయాల్లో తగ్గుదల , మితిమీరిన నిర్వహణ ఖర్చులే ఈ వరుస లేఆఫ్స్‌కు ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు. టెక్ ఇండస్ట్రీలోని ప్రముఖ కంపెనీలన్నీ పునర్వ్యవస్థీకరణ పేరిట ప్రకటిస్తున్న ఈ పింక్ స్లిప్పులు, రాబోయే రోజుల్లో సాధారణ , అనుభవజ్ఞులైన ఉద్యోగులకు మరింత కఠిన సవాళ్లు విసరనున్నాయని ఐటీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+