ఏపీలో అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై మంత్రి మండిపల్లి ఏమన్నారంటే!

అర్నబ్ తుఫాన్ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అర్నబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక మార్గాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రజల ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు.

ప్రయాణికుల భద్రతే ప్రధానం అని మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. తుఫాన్ సమయంలో భారీ వర్షాలు, గాలులు కారణంగా చెట్లు కూలడం, రోడ్లు నీట మునగడం, కొన్ని చోట్ల రహదారులు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీనివల్ల చాలా మార్గాల్లో బస్సులు నడపడం ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా తీరప్రాంత జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖపట్నం ప్రాంతంలోనే 160కి పైగా సర్వీసులు రద్దు చేశారు.

APSRTC Bus Services to Resume Based on Road Conditions After Cyclone Arnab Minister Mandipalli

ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ.. రోడ్లు సాధారణ స్థితికి వచ్చిన ప్రాంతాల్లో వెంటనే సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి వైపు బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని, ప్రజలకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని మంత్రి మండిపల్లి సూచించారు.

ఆర్టీసీ అధికారులు రోడ్ల పరిస్థితిని పరిశీలించి, సురక్షితమైన మార్గాల్లో మాత్రమే బస్సులను నడపాలని ఆదేశించారు. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కూడా చెప్పారు. డిపోలు, బస్సులు, ఇతర ఆస్తులను రక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ తర్వాత రవాణా వ్యవస్థను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యం అని మండిపల్లి అన్నారు.

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: పవన్ కళ్యాణ్ ఆదేశం
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: పవన్ కళ్యాణ్ ఆదేశం

చెట్లు తొలగింపు, రోడ్లు శుభ్రం చేయడం, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ వంటి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తయిన కొద్దీ మరిన్ని మార్గాల్లో బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రయాణికులు అనవసర ప్రయాణాలు నివారించి, అధికారుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు. రోడ్లు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి సర్వీసులు ప్రారంభమవుతాయని అంచనా. దీని కోసం అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+