చంద్రబాబు నోబెల్ బహుమతి వ్యాఖ్య: వైసిపి ఎమ్మెల్యే అనిల్ సెటైర్లు
ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

నోబెల్ బహుమతి ఎందుకిస్తారో తెలియదా?
నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారో కూడా సీఎం చంద్రబాబుకు తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మతి తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మెడల్ సాధిస్తే నోబెల్ బహుమతి ఇప్పిస్తానని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మానసికస్థితి తెలుస్తోంది
నోబెల్ బహుమతి ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు.. అనే విషయాలపై కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడటం చూస్తుంటే ఆయన మానసికస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు.

ఒలింపిక్స్ కూడానా..
2019లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతున్నారని, ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి స్థాయిలో అవసరాలు ఉంటాయో కూడా తెలియకుండా మాట్లాడటం విచిత్రమన్నారు.

విశాఖ భూస్కాంపై గుడివాడ అమర్నాథ్..
విశాఖ ఇమేజ్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు చెడగొడుతున్నారని, భూదందాలపై సిట్ విచారణతో న్యాయం జరగదని వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ విశాఖలో అన్నారు. భూదందాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లో ప్రబలిన ఆంత్రాక్స్, విష జ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications