సామాన్యుడికి సారీ చెప్పిన సీఎం చంద్రబాబు!
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సామాన్యుడికి సారీ చెప్పారు. సంక్రాంతికి స్వగ్రామమైన నారావారిపల్లెకు వెళ్లిన సీఎంకు స్థానికులు తమ సమస్యలపై అర్జీలు అందజేయడానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ దారిలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో అటువైపు నుంచి వెళ్లాల్సిన ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు.

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం దిగువ మూర్తిపల్లెకు చెందిన నవీన్ హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తన కుటుంబంతో కలిసి సీఎం ఇంటివైపుగా వస్తున్నారు. అటువైపు వాహనాలు ఆపేయడంతో ఎ.రంగంపేట గ్రామం నుంచి సుమారు కిలోమీటరు దూరం నుంచి కాలి నడకన సీఎం ఇంటివరకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వల్లే తాము కిలోమీటరు నడవాల్సి వచ్చిందని భావించిన నవీన్ అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశాడు. అదంతా గమనించిన సీఎం చంద్రబాబు సహృదయంతో, సమస్యను అర్థం చేసుకుని నవీన్‌కు సారీ చెప్పారు. వెంటనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరిచమని పోలీసులను ఆదేశించారు.
ఓ సామాన్యుడికి సీఎం సారీ చెప్పడంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలు తెలిపి 'సీఎం జిందాబాద్' అంటూ నినాదాలు చేశారు. ఈ సంఘటనతో 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడు..' అంటూ సీఎం చంద్రబాబును కొనియాడారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications