స్థానిక ఎన్నికల వేళ చంద్రబాబు బిగ్ డెసిషన్ - మంత్రుల సమర్థతకు పరీక్ష..!!

స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 14న షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు జరుగుతోంది. నవంబర్ నెలాఖరు లోగా మొత్తం మున్సిపల్.. జెడ్పీ, పంచాయితీ ఎన్నికలను పూర్తి చేసే విధంగా కార్యాచరణ ఖరారైంది. మూడు విడతల్లో పంచాయితీ.. ఒక విడతలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో మంత్రులకు ఎన్నికల పై బిగ్ టాస్క్ ఫిక్స్ చేసారు.

స్థానిక ఎన్నికల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రులకు చంద్రబాబు కీలక దిశా నిర్దేశం చేసారు. ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందన్న సీఎం చంద్రబాబు నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే, ఇలా వరుసగా..!!
స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే, ఇలా వరుసగా..!!
cm-chandrababu-sets-big-task-for-ministers-over-local-body-elections-to-release-assembly-developmen

మంత్రులకు తేల్చి చెప్పిన చంద్రబాబు

మంత్రులు ప్రేక్షకుల మాదిరిగా ఉండవద్దని.. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రితో టచ్‌లో ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను సోమ, మంగళవారాలలో విడుదల చేస్తామని.. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చెప్పున విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో, ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి.. నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేసే విధంగా కసరత్తు కొనసాగుతోంది. కాగా.. ఇంఛార్జ్ మంత్రులకు సీఎం బాధ్యతలు అప్పగించటంతో ఇప్పుడు కూటమి పార్టీలతో సమన్వయంతో పాటుగా అభ్యర్ధుల ఖరారు.. ఎన్నికల నిర్వహణ మంత్రుల సమర్థతకు పరీక్షగా మారుతోంది. స్థానిక ఎన్నికల ఫలితాలే మంత్రుల రాజకీయ భవితవ్యాన్ని డిసైడ్ చేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+