స్థానిక ఎన్నికల ముహూర్తం, వారిదే గెలుపు బాధ్యత - ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా నిధులు...!!

స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసింది. సుప్రీం తీర్పు తరువాత జరిగిన ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫారసు లకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బీసీలకు ఎక్కడ ఎన్ని స్థానాలు కేటాయించాలో డిసైడ్ అయింది. ఇక.. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేసే గడువు పైనా స్పష్టత వస్తోంది. మూడు విడతల్లో పంచాయితీ.. ఒక విడతలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసేందుకు కార్యాచరణ ఖరారు చేస్తున్నారు.

ఏపీ కేబినెట్ భేటీలో స్థానిక ఎన్నికల పైన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు పలు అంశాల పై మార్గ నిర్దేశం చేసారు. ఎన్నికలకు కూటమి సిద్ధంగా ఉందన్న సీఎం చంద్రబాబు నవంబర్ 15వ తేదీ నాటికి స్థానిక ఎన్నికలు పూర్తి చేసి రెగ్యులర్ పరిపాలనలోకి వెళ్లాలని సూచించారు. కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదే అని స్పష్టం చేశారు. మూడు పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ఇన్‌ఛార్జ్ మంత్రులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఏ ఒక్క స్థానం ఓడిపోవడానికి వీలులేదని.. 100 శాతం స్థానాలు గెలుచుకొని తీరాల్సిందే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికలను మంత్రులు, ఎమ్మెల్యేలు సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు.

 స్థానిక ఎన్నికల్లో తేలిన రిజర్వేషన్లు - ఎవరికి ఎన్ని సీట్లు..!!
స్థానిక ఎన్నికల్లో తేలిన రిజర్వేషన్లు - ఎవరికి ఎన్ని సీట్లు..!!
cm-chandrababu-sets-november-15-deadline-to-complete-ap-local-body-elections-here-the-details

ఎమ్మెల్యేలకు నియోజకవర్గ నిధులు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం లో తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు విమర్శించారు. ఇక.. ఎల్‌నినో సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో 34 శాతం లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గత ఏడాది నీటి నిల్వలు చేసుకోవడం వలన ఈ ఏడాది కొంతవరకు బయటపడ్డామని చెప్పుకొచ్చారు. మంత్రులు ప్రేక్షకుల మాదిరిగా ఉండవద్దని.. కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న సంబంధిత శాఖ మంత్రితో టచ్‌లో ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను సోమ, మంగళవారాలలో విడుదల చేస్తామని.. ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చెప్పున విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దీంతో, ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి.. నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేసే విధంగా షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+