కీలక పరిణామాల వేళ ఢిల్లీకి చంద్రబాబు, బిగ్ డెసిషన్..!?

ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఈసీ తో సహా పలు అంశాల పైన కేంద్రంలోని ముఖ్య నేతలు వరుస సమావేశాల్లో నిమగ్నమయ్యారు. కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. పలువురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళన పైనా చర్చ జరుగుతోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పైన మంత్రాంగం సాగుతోంది. కాగా.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ ఆసక్తి కర నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

 ధైర్యం ఉందా - కడప గడ్డ పై జగన్ కు చంద్రబాబు సవాల్..!!
ధైర్యం ఉందా - కడప గడ్డ పై జగన్ కు చంద్రబాబు సవాల్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ నెల 7వ తేదీన ఢిల్లీకి పయనం కానున్నారు. బుధవారం ఉదయం అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఆయన నేరుగా ఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కీలక కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

 రాజధానిలో ఆ భూముల మినహాయింపుల పై చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
రాజధానిలో ఆ భూముల మినహాయింపుల పై చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
CM Chandrababu to Visit Delhi for Two Days Hold Key Meetings Amid Cabinet Expansion Buzz

కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యక్ష మౌలిక సదుపాయాల గ్రాంట్లకు సంబంధించిన నిబంధనలపై ఆయన కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేసే వీలుగా కేంద్రం ఆమోదించిన నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని జలశక్తి మంత్రిని కోరనున్నారు. విశాఖపట్నం మెట్రో సహా పలు అంశాల పైన కేంద్ర మంత్రులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాల పరిష్కారంతో పాటు కొత్త ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం పొందే అంశంపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కేంద్రంలో ప్రస్తుతం సీఈసీ వివాదం, కేంద్ర మంత్రివర్గ విస్తరణ, మహిళా రిజర్వేషన్లతో పాటుగా డీలిమిటేషన్ చట్టం కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పైన కీలక మంత్రాంగం కొనసాగుతోంది.

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోదీ టీం కొత్త నిర్ణయాలకు సిద్దం అవుతోంది. ఈ క్రమంలో భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత దక్కనుంది. దీంతో,నిర్ణయాలతో పాటుగా టీడీపీకి మరో గవర్నర్ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఢిల్లీ పర్యటన వేళ చంద్రబాబు కేంద్రంలోని ముఖ్య నేతలతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటుగా.. రాజకీయ పరమైన చర్చలు చేసే అవకాశం ఉంది. దీంతో.. చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైనా ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+