అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ లో బిల్లు..!

మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలు కూడా కేంద్రం నుంచి వరాల కోసం ఎదురు చూస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వం సైతం ఇందుకు మినహాయింపు కాదు. బుధవారం సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు... కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆర్థిక సాయం అంశాలు కూడా తెరపైకి వచ్చాయి.

ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం బిజీ బిజీగా గడిపారు. పోలవరం పర్యటన ముగించుకున్న ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై వీరిద్దరూ చర్చించుకున్నారు.ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని... ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి మరింత ఎక్కవ సహకారం అందించాలని తన ప్రతిపాదనను అమిత్ షా ముందుంచారు.

CM Chandrababu Urges Amit Shah to Introduce Parliament Bill Declaring Amaravati as Andhra Pradesh Capital

అమరావతికి చట్టబద్దత..

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు... రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని చెప్పారు.

జీ రామ్ జీ తో ప్రతికూల ప్రభావం..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన జీ రామ్ జీ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని ముఖ్యమంత్రి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షాకు సీఎం వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే సహకరిస్తోందని... ఇదే తరహా సహకారాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా పరిణామాలపై వీరిద్దరు చర్చించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+