జగన్ జిల్లాలో ఆ కాలేజ్ అమ్మాయి ఫ్యామిలీకి సీఎం ఓదార్పు
మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం జరగడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇంటర్ కాలేజ్ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కన ఉండే ముళ్లపోదల్లోకి పిలుచుకుని వెళ్లి అదే ముళ్ల చెట్లలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్నేష్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడని పోలీసులు గుర్తించి అతన్ని ఇప్పటికే అరెస్టు చేశారు.

కేసు నమోదు చేసిన బద్వేల్ గ్రామీణ పోలీసులు నిందితుడు విగ్నేష్ ను పట్టుకుని విచారణ చేశారు. నిందితుడు విగ్నేష్ కి, ఇంటర్ విద్యార్థినికి మధ్య ప్రేమ వ్యవహారంలో గొడవలు ఉన్నాయని, పెళ్లి చేసుకునే విషయంలోనే కాలేజ్ అమ్మాయి హత్యకు గురైయ్యిందని పోలీసులు గుర్తించారు. బద్వేలు సమీపంలోని సెంచురీ ప్లైవుడ్ సమీపంలో ఈ సంఘటన జరగడంతో బద్వేల్ లో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు నిందితుడిని వెంటనే అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులను ఫోన్ లో పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. అనంతపురం ఇన్ చార్జ్ కలెక్టర్ అదితి సింగ్, టీడీపీ సీనియర్ నాయకులు రూ 10 లక్షల చెక్ ను బాధితిరాలి కుటుంబ సభ్యులకు అందించారు. ఆడపిల్లపై ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ఇప్పటికే హెచ్చరించారు.












Click it and Unblock the Notifications