టార్గెట్ జగన్..వైసీపీ అవినీతిపై చంద్రబాబు కీలక నిర్ణయం..?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలు, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. చంద్రబాబు తొలి కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ముఖ్యంగా జగన్ టార్గెట్‌గానే ఈ కేబినెట్ సమావేశం జరిగిందని ని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎనిమిది శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రానికి 14 లక్షల కోట్లకు పైగానే అప్పుల భారం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ అప్పులను ఎలా తెచ్చారు.. ఎలా ఖర్చు పెట్టారు.. ఆ నిధులన్నీ ఏమైపోయాయన్న దానిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించారని సమాచారం.

cm Chandrababu s key decision on YCP corruption

లబ్ధిదారుల అకౌంట్‌ల్లో చేసిన పథకాలు మినహాయించి మిగిలిన నిధులను ఎలా ఖర్చు చేశారనే దానిపై లెక్కలు బయటకు తీయనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్ గోల్‌మాల్‌పై విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంత విధ్వసం జరిగిందని టీడీపీ, జనసేన నేతలు పదేపదే అంటున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ విధానాలపైనా చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వ చేసిన అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైనా కీలక చర్చ జరగినట్టు తెలుస్తోంది. మొత్తానికి జగన్ టార్గెట్‌గా చంద్రబాబు తన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారనే సమాచారం అందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+