పక్కాప్లాన్ చేస్తున్న చంద్రబాబు. రికార్డు బద్దలు కొట్టాలని ప్లాన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు శక్తికి మించి పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్న కార్యకర్తలను మనం కాపాడుకోవాలని, ఆ దిశగా పని చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు.
శక్రవారం ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. అక్టోబర్ 26వ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యత్య నమోదు మొదలు పెడతామని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు చెప్పారు. వంద రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 5 లక్షల రూపాయలు ప్రమాద భీమా ఇస్తామని, వారి కుటుంబ సభ్యులను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులకు చెప్పారు.

అలాగే ప్రమాదంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల విద్య, వైద్యం కోసం అయ్యే పూర్తి ఖర్చులు మేమే భరిస్తామని, వారికి ఉపాధి కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో నమోదు కావాలని, ఆ దిశగా ప్రతి నాయకుడు పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని, ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీలో ప్రజలు చేరేలా వారిని ఒప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిసింది. ప్రస్తుతం మనం అధికారంలో ఉన్నామని, తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తారని, గతంలో ఉన్న పార్టీ కార్యకర్తలే కాకుండా ఇతరులను కూడా పార్టీలో చేరాలా నాయకులు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు సూచించారని తెలిసింది. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన నాయకులకు పార్టీ అండగా ఉంటుందని, కష్టపడి పనిచేసే నాయకులకు నామినేటెడ్ పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులకు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications