కిరణ్ మంచి ప్లేయర్ కానీ: సి రామచంద్రయ్య వ్యాఖ్య

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పోరాడుతున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయాన్ని ఎదిరించి దైర్యంగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.
కిరణ్ హయాంలో పార్టీ బలపడినా విభజన నిర్ణయంతో మొదటికే మోసం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకు రాలేదని కూడా తెలిపారు.
అసెంబ్లీకి వచ్చే బిల్లులో రాయల తెలంగాణ ఉంటే తాము అదే కోరుతామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణకు సుముఖంగా ఉన్నారని కానీ, వారు బయటకు చెప్పలేకపోతున్నారని చెప్పారు. విభజన అంతా అమ్మ చేతిలో ఉందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.












Click it and Unblock the Notifications