బుట్టా రేణుకకు సీఎం జగన్ బంపర్ ఆఫర్..?
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారం కోసం అన్నీ రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మరోమారు అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే తిరిగి అధికారంలోకి తీసుకువస్తాయని పార్టీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికలకు ఎమ్మెల్యేలను సిద్దం చేస్తూనే.. మరో వైపు అభ్యర్థుల ఒడపోత కార్యక్రమం మొదలుపెట్టారు.
ప్రజల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకపడిన వారికి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసి పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగులను మార్చి వారిని వేరే నియోజకవర్గాలకు ఇంచార్జులుగా నియమించారు. దీనిలో భాగంగానే కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే తెలియడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.

ఆయన స్థానంలో కర్నూల్ ఎంపీగా మంత్రి గుమ్మునూరు జయరాం పేరు వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన ఎంపీగా పోటీ చేయడానికి పెద్దగా సముఖత వ్యక్తం చేయడం లేదు. 2019 ఎన్నికల్లో ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన .. తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేస్తానని పార్టీకి తెలియజేశారు. గత కొద్దిరోజులుగా మంత్రి జయరాం పార్టీ నేతలకు అందుబాటులోకి రాకపోవడంతో..ఆయన వైసీపీలో ఉంటారా లేదా అనే చర్చ మొదలైంది.

వెంటనే అప్రమత్తం అయిన వైసీపీ అధిష్టానం కర్నూల్ ఎంపీ స్థానానికి బలమైన నేత కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ఈక్రమంలో గతంలో కర్నూల్ ఎంపీగా పని చేసిన బుట్టా రేణుక పేరును సీఎం జగన్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసిన బుట్టా రేణుక బంపర్ మెజార్టీతో విజయం సాధించారు.

కానీ తరువాత రాజకీయ పరిణామాలతో ఆమె టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరారు. అప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో.. బుట్టా రేణుకకు జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. ఆమె ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆమె ఎమ్మినిగూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని వైసీపీ నాయకులు కూడా భావించారు.

కాని సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తన అనుచరుడుకి టికెట్ ఇప్పించడంతో బుట్టా రేణుకకు నిరాశే ఎదురైంది. తాజాగా గుమ్మునూరు జయరాం కర్నూల్ ఎంపీగా పోటీ చేయడానికి అయిష్టత చూపడంతో..ఆ స్థానంలో బుట్టా రేణుకను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం కూడా ఆమెకు ఉండటంతో.. బుట్టా రేణుక వైపే జగన్ మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కర్నూలు పార్లమెంట్ బరిలో బుట్టా రేణుక పేరు దాదాపు ఖారారైనట్టు సమాచారం అందుతుంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికి ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications