Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అచ్చెన్నాయుడు పై అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న ముఖ్యమంత్రి అభ్యర్ధుల ఖరారు పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా ముందుగా టీడీపీ అభ్యర్దులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటిస్తున్నారు.శ్రీకాకుళం పర్యటనలో భాగంగా టెక్కలి అభ్యర్దిని ముఖ్యమంత్రి ఖరారు చేసారు. ఇదే జిల్లా నుంచి టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పైన పోటీ చేసే అభ్యర్దిని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

టెక్కలి అభ్యర్ధి ఖరారు:టెక్కలి లో పార్టీ నేతల గురించి ముఖ్యమంత్రి బహిరంగ సభలో కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు చేసారు. పార్టీ కోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. అందరి ఆమోదంతో వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుంచి దువ్వాడ శ్రీను ను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. శీను ను టెక్కలి అభ్యర్దిగా మీ చేతుల్లో పెడుతానంటూ జగన్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసారు.

ys jagan duvvada srinivas atchannaidu

వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి ప్రతీ నియోజకవర్గంలోనూ సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. జిల్లా పర్యటనల్లో అందునా బహిరంగ సభలో సీఎం 2024 ఎన్నికల అభ్యర్ధిని అందరి సమక్షంలో ప్రకటించటం ఇదే తొలి సారి.

అచ్చెన్న వర్సస్ దువ్వాడ :టెక్కలి నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీను గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పేరాడ తిలక్ పోటీ చేసారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేతిలో 8,545 ఓట్ల తేడాతో తిలక్ పరాజయం పాలయ్యారు. కానీ, ఈ సారి తిరిగి దువ్వాడ శ్రీనుకే సీఎం జగన్ సీటు ఓకే చేసారు. 2014,2019 ఎన్నికల్లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు అంతకు ముందు హరి శ్చంద్రాపురం నుంచి మూడు సార్లు విజయం సాధించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి వారి నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అయితే, నియోజకవర్గంలో నేతల మధ్య అనైన్యతను జగన్ ప్రస్తావిస్తూ..సభా వేదికగానే అందరూ దువ్వాడ శ్రీనుకు సహకరించాలని సూచించారు.

బహిరంగ సభలో ప్రకటన:కొంత కాలం క్రితం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో టెక్కలి పార్టీ నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలోనే దువ్వాడకు దాదాపు లైన్ క్లియర్చేసారు. 2024లో దువ్వాడ శ్రీను టెక్కలి నుంచి పోటీ చేస్తారని, ఆయన్ను గెలిపించుకు తీసుకురావాలని అప్పుడే ఎమ్మెల్సీ ఇస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.

అయితే, నియోజకవర్గంలో ఇతర నేతలను కలుపుకుపోవటంతో దువ్వాడ శ్రీను ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. టెక్కలి నుంచి మాజీ తిలక్ తో పాటుగా కేంద్ర మంత్రి కృపారాణి సీటు ఆశించారు. ఇప్పుడు సీఎం జగన్ జిల్లా బహిరంగ సభలోనే దువ్వాడ శ్రీను పేరు ప్రకటించారు. దీంతో, టికెట్ ఆశించిన నేతల స్పందన పైన స్పష్టత రావాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+