అవినీతికి మారుపేరుగా ఉన్న జగన్... అవినీతీ రహిత పాలనపై మాట్లాడడం హస్యస్పదం...
అవినీతికి మారుపేరుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ అవినీతీ రహిత పాలన అందిస్తామని చెప్పడం హస్యస్పదమని అన్నారు టీడీపీ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ విమర్శించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌తో టచ్‌లో ఉన్నారన్నంటూ ఆయన గోబెల్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అన్నారు.
పార్టీని భవిష్యత్‌లో పటిష్టపరించేందుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని తీసుకువస్తామని చెప్పారు.ఇందుకోసం పార్టీ సీనియర్లు అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని ఆయన చెప్పారు.ఇక మంత్రులు చేస్తున్న ప్రకటనల్లో గందరగోళం నెలకొందని ఆయన పేర్కోన్నారు.మరోవైపు టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ మారడంతో పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకుంటున్నారు.. . పార్టీలో ఉంటూ అన్ని ప్రయోజనాలు పోందిన అనంతరం స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లే వారికి భవిష్యత్‌లో స్థానం ఉండదని బుచ్చయ్య చౌదరీ స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు తమ అవసరాలు తీర్చుకుని అధికారం కొల్పోయిన తర్వాత పార్టీలు మారే వ్వక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అయన చెప్పారు. రానున్న రోజుల్లో అలాంటీ వ్యక్తులకు స్థానం లేదని అన్నారు. ఇటీవల టీడీపీ రాజ్యసభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహనరావులు పార్టీ ఫిరాయించడంపై గోరంట్ల పై విధంగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications