ఆస్పత్రిలో గవర్నర్, సర్జరీ - సీఎం జగన్ ఆరా..!!

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్‌కు అపెండిసైటిస్‌గా వైద్యులు ధృవీకరించారు. సర్జరీ చేసారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు బులెటిన్ విడుదల చేసారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ తిరుమల నుంచి గవర్నర్ ఆరోగ్యంపైన ఆరా తీసారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్ కోలుకున్నారు. సోమవారం గవర్నర్‌ అస్వస్థత గురించి రాజ్‌భవన్‌ అధికారుల నుంచి సమాచారం అందుకున్న వైద్యులు తొలుత విజయవాడకే వచ్చి గవర్నర్‌కు పరీక్షలు చేశారు. ఆస్పత్రిలో చేరాలని ఆయనకు సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరిన గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం.. అపెండిసైటిస్‌గా తేల్చారు. వెంటనే గవర్నర్‌ నజీర్‌కు సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ ఈ రోజు డిశ్చార్జ్ ఆయన అయ్యే అవకాశాలు
కనిపిస్తున్నాయి.

CM Jagan enquire on Governor Abdul Nazeer Health, Discuss with Rajbhavan officials

మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించారు. గవర్నర్ ఈరోజు తీవ్ర కడుపు నొప్పి కారణంగా మణిపాల్ హాస్పిటల్లో చేరారు. వైద్యపరీక్షల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్‌తో బాధ పడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. గవర్నర్‌కి రోబో సాయంతో 'అపెండెక్టమీ' అనే సర్జరీని డాక్టర్లు చేశారు. సర్జరీ విజయవంతం అయినట్లుగా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డా. సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ ఆరోగ్య పరిస్థితిపై.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి తిరుపతి, తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్‌ అస్వస్థత సమాచారం అందుకున్న వెంటనే.. సీఎం జగన్‌ అధికారులతో మాట్లాడారు.గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అనారోగ్యానికి గురై మ‌ణిపాల్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆకాంక్షించారు. క‌డుపునొప్పితో గ‌వ‌ర్న‌ర్ గారు ఆస్ప‌త్రిలో చేరార‌ని తెలిసి ఆందోళ‌న‌కి గుర‌య్యానని. అపెండిసైటిస్ గా తేల్చిన వైద్యులు ఆప‌రేష‌న్ విజయవంతంగా చేశార‌ని, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌నే స‌మాచారం తెలిసి ఊపిరి పీల్చుకున్నట్లు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+