బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ! సోషల్ మీడియాలో రచ్చ.. ఇప్పుడు కూడా అంతేనా?
Recommended Video
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నవో... లేక వైసీపీ అధినేతగా పాదయాత్ర చేసినవో కాదు. తన తండ్రి వైయస్‌తో ఉన్నవి అసలే కాదు. అసలు రాజకీయాలతో ఎటు వంటి సంబంధం లేకుండా ఉన్న రోజులవి. అప్పుడు జగన్ వయసు కేవలం 25 సంవత్సరాలు. అయితే, కడప జిల్లాలో నాటి జగన్ అభిమానం ఎవరి మీద ఉందో..ఎలా ఉందో తెలియచేయటానికి ఆ ఫొటోలు ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి . సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తన్న కొన్ని ఫొటోలు సినీ పరిశ్రమలో..ఇటు రాజకీయంగానూ వేడి పుట్టిస్తున్నాయి.

జగన్ 25 ఏళ్ల వయసులో..కడపలో..
వైయస్ జగన్ వయసు అప్పుడు 25 ఏళ్లు. రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. తన తండ్రి వైయస్సార్ మాత్రం ఏపీ ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ రాజకీయాల్లో బాగా బీజీగా ఉన్న రోజులు. హైదరాబాద్ ప్రగతి కాలేజీలో డిగ్రీ చేసిన జగన్ కొత్తగా వ్యాపారాలు గురించి తెలుసకుంటున్న సమయం. సరిగ్గా..అదే సమయంలో జగన్‌కు కడప జిల్లాలో మాత్రం ఒక హోదా ఉంది. తండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉంటే.. ఆ పార్టీకి వ్యతిరేకంగా మరో స్థాపించిన నాయకుడి వారసుడి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు. ఆ హీరో అంటే జగన్‌కు ఎంతో అభిమానం. తండ్రి ఉన్న పార్టీ వేరు..ఆయన అభిమానించే హీరో మూలాలు వేరు. అయినా..సరే తండ్రి రాజకీయాలకు..తన అభిమానానికి సంబంధం లేదని భావించారు. తనకు ఇష్టమైన వారిని అభిమానించే స్వేఛ్చ తనకు ఉందని చెప్పుకొచ్చారు. అంతే, ప్రతిపక్ష నేత తనయుడిగా తనకు నాటి రాజకీయాలతో సంబంధం లేదంటూ..ఆ హీరో పైన తన అభిమానం చాటుకున్నారు.

బాలయ్య అభిమాన జిల్లా అధ్యక్షుడిగా..
వైయస్ జగన్ చిన్నప్పటి నుండి నందమూరి బాలకృష్ణ అభవిమాని. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి గా ఉండే వారు. ఒక వైపు తండ్రి టీడీపీతో పోరాటం చేస్తున్నా..తాను మాత్రం నందమూరి వారసుడు బాలకృష్ణ సినిమాలు అంటే ఎంతగానో ఇష్టపడేవారు. బాలకృష్ణ నటించిన సినిమా విడుదల అయితే ప్రతీ జిల్లాలో తరహాలోనే కడప జిల్లాలో హంగామా బాధ్యతలను జగన్ తీసుకొనే వారు. అదే విధంగా ఆయన పత్రికల్లోనూ తన అభిమానాన్ని చాటుకుంటూ ప్రత్యేకంగా ప్రకటనలు ఇచ్చేవారు. కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా 2000వ సంవత్సరం ఆరంభంలో ఇచ్చిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. నాడు సినిమా హీరోగా బాలకృష్ణను జగన్ అభమానించిన విషయాన్ని ఇప్పుడు బాలయ్య అభిమానులు ఆ ఫొటో ద్వారా గుర్తు చేస్తున్నారు. అయితే, నాడు యువకుడిగా ఉన్న సమయంలో బాలకృష్ణ మీద ఉన్న అభిమానం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా మనసులో ఉందా..లేదా అదే ఇప్పుడు అసలు చర్చ.

ఇప్పటికీ అదే అభిమానమా..
ఇక, తన తండ్రి మరణంతో రాజకీయంగా అనేక ఒడి దుడికులు ఎదుర్కొన్న జగన్..పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. ఇక, వైసీపీ స్థాపించిన తరువాత ఆయనకు ఇతర వ్యాపకాలు లేకుండా పోయాయి. వ్యాపారలు సైతం తన భార్య భారతికి అప్పగించారు. బాలకృష్ణ అభిమాని అయిన జగన్..తన హీరోను ఒక ఎమ్మెల్యేగా 2014లో శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో చూసారు. నాడు బాలకృష్ణ ఓటమి కోసం ప్రచారం చేసారు. బాలకృష్ణ అధికార పార్టీ ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఒక సినిమా ఫంక్షన్‌లో మహిళల గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ పరోక్షంగా ప్రస్తావించగా.. బాలయ్య వాటిని ఖండించారు. అది మినహా మరెప్పుడూ బాలయ్య పైన విమర్శలు చేయలేదు. తాజా ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించటం కోసం హిందూపూర్‌లో తన పార్టీ అభ్యర్ది ఇక్బాల్‌కు మద్దతుగా ప్రచారం చేసిన వ్యక్తిగతంగా బాలకృష్ణను లక్ష్యంగా చేసుకోలేదు. ఇక, ఇప్పుడు జగన్ సీఎం అయిన తరువాత బాలకృష్ణ సైతం జగన్ పైన ఏ రకమైన విమర్శలు చేయటం లేదు. ముఖ్యమంత్రి అయిన జగన్‌ను ఎంతో మంది రియల్ హీరోగా అభివర్ణిస్తున్నా.. జగన్ మాత్రం తన రీల్ హీరో బాలకృష్ణగానే ఇంకా భావిస్తున్నారనుకోవాలా...కాలమే సమాధానం చెబుతుంది.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications