ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముందుకే- అందుకే సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు : సీఎం జగన్..!!
ఇచ్చిన ప్రతీ హామీలు చేస్తూ..ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. ప్రజలు ఇబ్బంది పడకుడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని సీఎం జగన్ చెప్పారు.గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అధికారంలోకి వస్తూనే తొలి సంతకం తో పెన్షన్ పెంచామని..మూడు వేలకు పెంచుకుంటూ పోతామనే హామీలో భాగంగా.. ఈ రోజు నుంచి రూ 2500 అందిస్తున్నామని వెల్లడించారు.
ఇచ్చిన ప్రతీ హామీ అమలు
ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్.. చేయనంత ఖర్చు ఏపీలో చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికే పెన్షన్లు ఇచ్చేదని..ఇప్పుడు ఆ సంఖ్య 62 లక్షల మందికి చేరిందని చెప్పారు. గత ప్రభుత్వం పెన్షన్ కోసం రూ.400 కోట్లు ఖర్చు చేసింది. మన ప్రభుత్వం పెన్షన్ కోసం నెలకు రూ.1450 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలాగా పెన్షన్‌లో కోత లేకుండా... కుల,మతం, రాజకీయాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామని... అర్హులందరికీ పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు.

పెన్షన్ మొత్తం పెంపు
ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి...వాలంటీర్లుపెన్షన్ అందిస్తున్నారని వివరించారు. లబ్దిదారులు ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాలంటీర్లను కలవాలని సూచించారు. అభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు విమర్శలు చేస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వారు రాజధానిగా చెప్పే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే..డెమోగ్రఫిక్ బ్యలెన్స్ తప్పుందని చెబుతున్నారని వివరించారు. ఓటీఎస్ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారన్నారు. పేదలకు అందుబాటులోకి తేవాలని ... సినిమా టిక్కెట్ల ధరలు తగ్గిస్తే దాని పైనా రాజకీయం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

అందుకే సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించాం
ఇటువంటి వారంతా పేదలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి విషయంలో వెనక్కు తగ్గేది లేదని సీఎం జగన్ స్పష్టం చేసారు. నిరుపేదల కష్టాలు వారికి తెలుసా అని ప్రశ్నించారు. వాళ్లకు రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం కనిపించటం లేదా అని నిలదీసారు. ఆర్థిక ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చారు. 31 నెలల పాలనలో ప్రభుత్వం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా... పేదలకు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications