ఎన్నికల వేళ సీఎం జగన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం

సీఎం జగన్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈక్రమంలో హెలికాఫ్టర్‌లో సీఎం జగన్‌ అక్కడకు చేరుకున్నారు. సీఎం జగన్ అనంతపురం జిల్లాలోని కొనకొండ్లలోలో స్థానికంగా కార్యక్రమంలో హజరవ్వడానికి వెళ్లారు. అయితే ల్యాండింగ్ సమయంలో కొంత ఇబ్బంది కలిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల హెలిప్యాడ్ ల్యాండింగ్ వద్ద భారీగా దుమ్ముతో పాటు, ఓ చీపురు గాల్లోకి లేచి పడింది. దీన్ని గమనించిన పైలెట్ హెలికాప్టర్‌ను కాసేపు గాల్లోనే ఉంచారు.

పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో జగన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒకవేళ ఆ చీపురు ఎగిరి హెలిప్యాడ్ రెక్కలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు అధికారులు తెలిపారు.

CM Jagan has a narrow miss during the election

గతంలో కూడా సీఎం జగన్ హెలికాప్టర్‌‌లో పలు సాంకేతిక లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హెలిప్యాడ్‌కు సంబంధించి మరో ఘటన పునరావృతం కావడంతో వైసీపీ క్యాడర్ ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి జగన్ ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ..అన్ని నియోజకవర్గాలు కవర్‌ చేసేలా "మేమంతా సిద్ధం" పేరుతో సీఎం జగన్‌ బస్సు యాత్ర చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+