వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పారిశ్రామిక రంగాన్ని ఆదుకునే సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ .. ఏం చేశారంటే

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో తీవ్ర సంక్షోభంలో ఉన్న పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా ప్రధానికి లేఖ రాసిన ఆయన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఇక ఈ నేపధ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2014-15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని , అలాగే మినిమం కరెంట్ డిమాండ్ చార్జీలను మూడు నెలల పాటు రద్దు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .

Recommended Video

YS Jagan's Idea To Save Economy Draws Huge Support | Red Zone | Green Zone | Oneindia Telugu
 2014 నుండి ఉన్న పెండింగ్ ప్రోత్సాహకాల బకాయిల చెల్లింపు నిర్ణయం

2014 నుండి ఉన్న పెండింగ్ ప్రోత్సాహకాల బకాయిల చెల్లింపు నిర్ణయం


ఎంఎస్‌ఎంఈలు లకు 2014 నుండి గత ఏడాది వరకు ఉన్న ప్రోత్సాహకాల బకాయిలను రూ.905 కోట్ల చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఎంఎస్‌ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవటానికి గతంలో సీఎం జగన్ తానూ స్వయంగా చేసిన ప్రతిపాదనలపై చేర్చిన్చారు. రాష్ట్రంలో కరోనా కష్ట కాలంలో కూడా పరిశ్రమలను ఆదుకోకుంటే పారిశ్రామిక వర్గాలు ఇబ్బంది పడతాయని గుర్తించి వారికి ఊరట కలిగే నిర్ణయాలు తీసుకున్నారు . ఇకప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు.

 905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామన్న సీఎం వైఎస్‌ జగన్‌

905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామన్న సీఎం వైఎస్‌ జగన్‌

ఎంఎస్‌ఎంఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం తీసుకున్న నిర్ణయం మేరకు మే నెలలో, జూన్‌ నెలలో వాటిని చెల్లించనున్నారు . 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకూ టీడీపీ హయాంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదు . ఇక ఆతర్వాత ఇప్పటి వరకు మొత్తం కలిపి రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .

 మూడు నెలల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని నిర్ణయం

మూడు నెలల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని నిర్ణయం

ఇక ఇప్పటికే లాక్ డౌన్ తో పరిశ్రమలు మూత పడ్డాయి. ఇక దీంతో పరిశ్రమలు నడవకున్నా మినిమం పవర్ చార్జ్ వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ ‌నెలల కాలానికి ఎంఎస్‌ఎంఈల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని కూడా సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో దాదాపు రూ.188 కోట్ల మేర అన్ని ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరనుందని చెప్తుంది ఏపీ ప్రభుత్వం . సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగనుంది.

తాజా నిర్ణయాలతో కాస్త వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందని భావన

తాజా నిర్ణయాలతో కాస్త వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందని భావన

సీఎం జగన్ తీసుకున్న తాజా నిర్ణయాలతో పరిశ్రమలకు కావాల్సిన వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందని భావిస్తున్నారు . టెక్స్‌టైల్‌ పరిశ్రమలతో పాటు , భారీ, అతి భారీ పరిశ్రమలకు ఏప్రిల్, మే, జూన్‌ మూడు నెలల కాలానికి మినిమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎలాంటి అపరాధ రుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈ భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి మరీ పారిశ్రామిక వర్గాలను ఆదుకోవాలని నిర్ణయం

బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి మరీ పారిశ్రామిక వర్గాలను ఆదుకోవాలని నిర్ణయం

ఇక అంతేకాదు ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈల తమ పరిశ్రమలను కొనసాగించటానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి మరీ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు . పారిశ్రామిక కార్యాకలాపాల నిర్వహణకు , అలాగే ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ . ఇక ఈ నేపధ్యంలో వర్కింగ్‌ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించారు. అతి తక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు .

కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న జగన్ ..

కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్న జగన్ ..

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి ఆలోచనలు చేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం జగన్ . ఇక ఈ మేరకు పారిశ్రామిక రంగం కుదేలు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై , అందించాల్సిన సహకారంపై లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడిన తర్వాత మరోసారి సమీక్షచేసి పారిశ్రామిక ప్రగతికి , వారికి కొంత కరోనా ఎఫెక్ట్ నుండి ఉపశమనం కలిగించటానికి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు సీఎం జగన్ .

English summary
AP govt to clear all industrial incentives, waive power charge for 3 months to boost MSMEs . The Andhra Pradesh government announced a slew of measures, including clearing 50 per cent of all pending industrial incentives of Rs 904 crore in the current month itself and waiving fixed electricity charges for three months, on Friday to ensure that the micro, small and medium enterprises (MSMEs) in the state reopen during the ongoing COVID-19 crisis. The state government has also decided to provide working capital loans to MSMEs at lower interest rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X