ఆ ఒక్క ఇంటర్య్వూతో ఏపీలో సత్తా ఎవరిదో తేలిపోయిందా..?
ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్నాయి. ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా జోరుగా ఎన్నికల నిర్వహిస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు పన్నుతుంటే.. కూటమితో గెలుపు ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు తమ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చి మరీ టీవీ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. వేర్వేరు ఛానెల్స్‌కు అటు జగన్ ,ఇటు చంద్రబాబు ఇద్దరు ఒకేరోజు ఇంటర్య్వూలు ఇవ్వడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉంటే చంద్రబాబు, జగన్‌ల ఇంటర్య్వూ వ్యూస్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జగన్ , చంద్రబాబుల ఇంటర్య్వూలు ఒకే సమయానికి లైవ్ రావడంతో ప్రజలు ఎవరి ఇంటర్య్వూను అధికంగా చూస్తారో అని ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే వ్యూస్ ప్రకారం వైసీపీ అధినేత , సీఎం జగన్ పూర్తి డామినేషన్ చూపించారు. ఐదేళ్ల తర్వాత జగన్ ఓ ఛానెల్‌కు ఇంటర్య్వూ ఇవ్వడం జరిగింది. జగన్ ఇంటర్వ్యూ వీడియోకు యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటర్య్వూకు పెద్దగా ఆదరణ కనిపించలేదు. టీడీపీ శ్రేణులు సైతం చంద్రబాబు ఇంటర్వ్యూకు దూరంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది.ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎన్నో సందేహాలకు సీఎం జగన్ స్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో పాటు ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి, కొత్త హామీలను ప్రకటించకపోవడం గురించి, గత ఐదేళ్లలో ఏపీలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల గురించి, వైట్ కాలర్ జాబ్స్ గురించి జగన్ సమాధానాలు ఇచ్చారు.
ఒకవైపు మోదీ రోడ్ షో జరుగుతున్నా జగన్ ఇంటర్వ్యూపై ఏపీ ప్రజలు ఆసక్తి కనబరిచారంటే జగన్ అంటే ప్రజల్లో ఏ స్థాయిలో నమ్మకం ఉందో సులువుగా అర్థమవుతుంది. ఈ ఒక్క ఇంటర్వ్యూతో ప్రజల మూడ్ ఏంటో తెలిసిపోయిందని వైసీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. మే నెల 13న ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మరీ ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.
-
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications