ఇదే లాస్ట్ ఛాన్స్ - మారాల్సిందే : మరోసారి కేబినెట్ విస్తరణ - సీఎం జగన్ సీరియస్..!!

ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ భేటీలో అధికారిక అజెండా పూర్తయిన తరువాత మంత్రుల పని తీరు పైన సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ తన సహజ ధోరణికి బిన్నంగా మంత్రులను హెచ్చరించారు. పని తీరు మెరుగు పర్చుకోకుంటే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. కేబినెట్ విస్తరణ జరిగి కొంత కాలమే అయినా..చెప్పిన విధంగా వ్యవహరించకపోతే మంత్రివర్గం మరోసారి విస్తరణ ఉంటుందని ఖరా ఖండిగా చెప్పేసారు.

ఉపేక్షించేది లేదంటూ

ఉపేక్షించేది లేదంటూ

ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. పార్టీ ముఖ్యమని ఎవరినీ ఉపేక్షించేది లేదంటూ ..ఇదే చివరి ఛాన్స్ అంటూ సీరియస్ అయ్యారు. కేబినెట్ లో అఫిషీయల్ అజెండా పూర్తయిన తరువాత మంత్రులతో రాజకీయ అంశాల పైన చర్చించారు, అధికారులు వెళ్లిన తరువాత, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం..మంచి పనుల గురించి ప్రజలకు వివరించటం లో మంత్రులు చొరవ తీసుకోవటం లేదంటూ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.

తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఎక్సైజ్ పాలసీ స్కాం విషయంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధం ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏ మంత్రి కౌంటర్ చేయకపోవటం పైన సీఎం నిలదీసారు.

అసత్య ఆరోపణలను తిప్పి కొట్టాల్సిందే

అసత్య ఆరోపణలను తిప్పి కొట్టాల్సిందే

ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని నిర్దేశించారు. గట్టిగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వంలోని మంత్రులంతా సమిష్టి బాధ్యతగా ప్రభుత్వ గౌరవం కోసం పని చేయాలి.. విమర్శల పై స్పందించాలని..ఏ అంశం పైన అయినా మంత్రులు మాట్లాడాల్సిందేనని సీఎం సూచించారు. కుటుంబ సభ్యులపైన అవసరంగా నిందలు వేస్తున్నారని చెప్పారు.

ఇక నుంచి ఏ మంత్రి ప్రతిపక్షాలు.. వ్యతిరేక మీడియా వార్తలను ఉపేక్షించటానికి వీళ్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. మనకెందుకని నిర్లిప్తంగా ఎవరైనా వ్యవహరిస్తే .. అలా ఉండే వారిని పక్కన పెడతానని..అందు కోసం వెనుకాడనని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి కేబినెట్ విస్తరణ తప్పదని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

స్పందించకుంటే..చర్యలు తప్పవు

స్పందించకుంటే..చర్యలు తప్పవు

మంత్రివర్గ సమావేశంలో దాదాపు 50కి పైగా అంశాల పైన చర్చించారు. ముఖ్యమంత్రి జగన్ కొద్ది నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ చేసారు. ఆ తరువాత పార్టీ సమావేశాల్లో మంత్రులు..పార్టీ నేతలు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్దేశించారు. కానీ, మంత్రుల్లో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన వారు ప్రభుత్వం పైన వస్తున్న ఆరోపణలపైన ఆశించిన స్థాయిల స్పందించటం లేదు.

ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ..సభల్లో ప్రతిపక్షాల తీరును తప్పు బడుతూ..ప్రచారాన్ని కౌంటర్ చేస్తున్నా..మంత్రులు ఆ స్థాయిలో స్పందించకపోవటంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. దీంతో..ఇప్పుడు ఒకే సారి మంత్రులందరికీ సీఎం జగన్ తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+