పదవుల్లో ప్రాధాన్యతలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ప్రభుత్వం తన ఒక్కడిది కాదని..అందరి ప్రభుత్వమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. సాధికారిత అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించామని చెప్పారు. లంచాలు, వివక్షకు తావులేకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం వివరించారు. ఎన్నికల కోసం కాదని..ప్రతీ వర్గానికి..ప్రతీ పేదవాడికి మంచి చేయాలనేది తన తపనగా చెప్పిన సీఎం జగన్ తాను కోరుకొనేది ఏంటో స్పష్టం చేసారు.
గుండెల్లో పెట్టుకుని : మైనార్టీలను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికొదిలేసింది. డిప్యూటీ సీఎం హోదాతో మైనార్టీలను ఈ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ముస్లింలలో పేదలందరికి వైయస్ఆర్ రిజర్వేషన్‌లు అమలు చేశారని సీఎం గుర్తు చేశారు. ఆయన కుమారుడిగా నాలుగు అడుగులు ముందు వేస్తూ మన పార్టీ నుంచి నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మైనార్టీలకు మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించామని సీఎం వైయస్ జగన్ చెప్పారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ మైనార్టీల అభ్యున్నతి కోసం 2019 నుంచి అనేక మార్పులు తీసుకొచ్చామని వివరించారు.

పదవుల్లో ప్రాధాన్యత : 53 నెలల తన పాలనలో రెండు సార్లు మంత్రిమండలిలో మార్పులు చేస్తే.. మైనార్టీ సోదరుడికి డిప్యూటీ సీఎం హోదా ఇచ్చామని గుర్తు చేసారు. నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోగలిగామని.. తొలిసారిగా ఒక ముస్లిం సోదరి శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారన్నారు. ష్ట్రంలో ఇచ్చే ప్రతి పదవిలో కూడా ఏకంగా చట్టం చేసి 50 శాతం పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే ఇవ్వాలని చట్టం చేసిన ప్రభుత్వమని వివరించారు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రతి అడుగులోనూ ప్రతి మాటకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ నిరుపేదలు అని ప్రతి సందర్భంలో నా..నా..నా..అంటూ వీరంతా నా కుటుంబం అని చెప్పి భరోసా ఇస్తూ అడుగులో అడుగు వేసిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు.
ఎన్నికల కోసం కాదు : పేద అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రూ.2.40 లక్షల కోట్లు జమ అయ్యాయని జగన్ చెప్పారు. ముస్లిం మైనారిటీలు,అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములను తీసుకుంటే 53 నెలల పాలనలో నేరుగా బటన్‌నొక్కి వారి ఖాతాల్లోకి అక్షరాల రూ.12,375 కోట్లు డీబీటీ ద్వారా పంపించగలిగితే..ఇక నాన్ డీబీటీ ద్వారా మరో రూ.10,800 కోట్లు..అంటే ఈ నాలుగున్నరేళ్ల పాలనలోఅక్షరాల రూ.23,176 కోట్లు నా ముస్లిం మైనారిటీలకు ఇవ్వగలిగామని వివరించారు. నాయకుడు అన్నవాడు ఎన్నికల కోసం పథకాలు పెట్టకూడదని, వారి భివిష్యత్ కోసం పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతోనే నిర్ణయాలు జరుగుతున్నాయని వివరించారు. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మీ బిడ్డ ప్రభుత్వం కోసం గట్టిగా దువ్వా చేయమని ముస్లిం సోదరులను కోరానని సీఎం గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications