ప్రధానిపై సీఎం వ్యాఖ్యలు : చంద్రబాబు పర్యటన వేళ : ట్రాప్ - అస్త్రం..!!
ముఖ్యమంత్రి జగన్ పోలవరం పైన తన వైఖరి తేల్చి చెప్పేసారు. పోలవరం నిధుల కోసం కేంద్రంతో పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. తొలి సారి బహిరంగంగా ప్రధానితో తాను ఏం చెప్పింది.. ఏం చెప్పబోయేది స్పష్టం చేసారు. కేంద్రం వద్దే డబ్బులు ఉంటాయని..తాను నేరుగా ప్రధానితో ఈ పోలవరం నిధుల పైన చర్చించానని వివరించారు. మంత్రులు ప్రతీ నెలా కేంద్రం వద్దకు వెళ్లి ఈ అంశం పైన చర్చలు చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావటం.. పునరావాస ప్యాకేజీ కేంద్రమే ఇవ్వాలని స్పష్టం చేసారు.

సీఎం జగన్ వ్యాఖ్యలతో కొత్త చర్చ
ఇదంతా మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం - కేంద్ర మధ్య జరుగుతున్న సంప్రదింపులు.. చర్చలు ఇప్పటి వరకు ఫలితం మాత్రం ఇవ్వలేదు. దీంతో..నేరుగా ముంపు ప్రాంతాల గ్రామాల ప్రజల వద్దకు సీఎం వెళ్లారు. అక్కడ ప్రజలకు సమస్యను వివరించి చెప్పారు. తాము చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. అయితే, ఇదే పోలవరం ముంపు మండలాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పర్యటించనున్నారు. ఇప్పటికే ముంపు గ్రామాల్లోని కొందరు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. సీఎం జగన్ ను సైతం కొందరు గ్రామస్థులు నేరుగా ఇదే విషయాన్ని అడిగారు. ముంపు గ్రామాల ప్రజలు గతంలో తమ పాలనలోన చేయని డిమాండ్ ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తోందని ప్రశ్నిస్తున్న చంద్రబాబు..ఇది ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నారు.

చంద్రబాబు టార్గెట్ జగన్
అదే సమయంలో పోలవరం పూర్తి చేయకపోవటం...నిర్మాణంలో సమస్యలు సైతం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పుడు..ప్రధాని పైన సీఎం చేసిన వ్యాఖ్యలు.. కేంద్ర సాయం పైన సీఎం ముంపు బాధిత గ్రామాల ప్రజలతో చెప్పిన మాటల పైన టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ముఖ్యమంత్రి కేంద్ర సాయం పైన చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు బడతూ..తనకు అనుకూలంగా మలచుకుంటారా, లేక కేంద్రం సాయం రాకపోవటం జగన్ వైఫల్యంగా ప్రచారం చేస్తారా అనేది చూడాలి. ఇప్పుడు తాము కుస్తీ పడుతున్నా కేంద్రం సాయం చేయటం లేదనే విధంగా చెప్పటం ద్వారా..చంద్రబాబు ఇది జగన్ వైఫల్యంగా ప్రచారం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కేంద్రానికి మద్దతుగా నిలుస్తారా
అయితే, చంద్రబాబు కేంద్రానికి అనకూలంగా మాట్లాడినా.. కౌంటర్ చేయటానికి వైసీపీ సిద్దంగా ఉంది. చంద్రబాబును ట్రాప్ చేసేందుకే ఆయన పర్యటన ముందుగా సీఎం జగన్ కేంద్రం పైన ఈ వ్యాఖ్యలు చేసారనే విశ్లేషణలు ఉన్నాయి. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తన్న ముఖ్యమంత్రి ఆకస్మికంగా కేంద్రం పైన వ్యాఖ్యలు చేయటం వెనుక వ్యూహం ఉందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్రం పైన చేసిన వ్యాఖ్యలను అస్త్రంగా మలచుకుంటారా.. కేంద్రానికి మద్దతుగా నిలుస్తారా.. వైసీపీ దీనిని ఏ విధంగా కౌంటర్ చేస్తుందనేది టీడీపీ అధినేత పర్యటన వేళ ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications