సీఎం జగన్ కీలక నిర్ణయం - ఇంటి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు : స్టేటస్ రిపోర్టుల పంపిణీ ..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమ పధకాల అమలు కొనసాగిస్తున్న ప్రభుత్వం...వాటి పైన ప్రజలకు మరింత వివరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఇంటి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరాలు పంపిణీకి జగన్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లోకి వీటి గురించి పూర్తి స్థాయిలో ప్రచారం జరగటం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇంటింటికీ పధకాల అమలు తీరు
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరాల్ని ఇంటింటికి పంపిణీ చేయడానికి ప్రణాళిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రణాళిక శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ పధకాలు స్టేటస్ రిపోర్టులు పంపిణీ చెయ్యడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇంటింటికి రెండు బ్రౌచర్ల రూపంలో ప్రభుత్వం పధకాల వివరాలు పంపిణీ చెయ్యాలని ఆదేశించింది. ఒకటవ బ్రోచర్లో రెండవ ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట - జగనన్న మ్యానిఫెస్టో - ఆరు పేజీలు అందులో పంపిణీ చేయనున్నారు.

ప్రతీ లబ్దిదారుడి పేరుతో లేఖలు
ఇక, రెండవ బ్రోచర్లో సంక్షేమ సంతకం రెండవ ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట - 16 పేజీలతో వివరాలు అందించనున్నారు. బ్రోచర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయిందని ఇవి ఆర్‌డిఓ కార్యాలయానికి చేరాక ప్రణాళికా బద్దంగా ఇంటింటికి పంపిణీ చెయ్యాలని సూచన చేసింది. బ్రోచర్ల ముద్రణా కంపెనీ అనుకున్న సమయానికే అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల కు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ లేఖ రాసారు. వరుసగా జరిగిన ఎన్నికల్లో తిరుపతి బై పోల్ తో పాటుగా.. వరుసగా జరిగిన స్థానిక సంస్థలు - మున్సిపల్ ఎన్నికలు..పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించింది.

వచ్చే ఎన్నికలకు పధకాలే ప్రచారాస్త్రాలుగా
ఇక, బద్వేలులోనూ భారీ మెజార్టీ సాధించింది. ప్రతీ ఇంటికి ప్రభుత్వం నుంచి మేలు జరుగుతుందనే విషయాన్ని నేరుగా వివరించటంతో పాటుగా.. ఆర్దిక కష్టాల్లోనూ ఇచ్చిన మాట కోసం ఏ రకంగా అమలు చేస్తుందీ అందులో వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ఏం చెప్పారు...అక్షరాల ఏ విధంగా అమలు చేసారనేది సంపూర్ణంగా వివరించనున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రతీ ఇంటికి లేఖల రూపంలో ఈ బ్రోచర్లను పంపటం ద్వారా మరింతగా దగ్గరవుతారని భావిస్తున్నారు. దీంతో...ఈ నెలలోనే వీటి పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ఈ బ్రోచర్లు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications