మ్యారేజీ స్టార్ ఓ ప్యాకేజీల త్యాగరాజు: సై, చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్..!!

ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు, పవన్ లక్ష్యంగా పంచ్ లతో ఫైర్ అయ్యారు. ఏ భార్యతోనూ మూడు నాలుగేళ్లు కాపురం చేయలేని పవన్..చంద్రబాబుతో మాత్రం 15 ఏళ్ల బంధం ఉండాలని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. ఈ ఇద్దరికి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. తన పాలన పై ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు ఏ గ్రామంలో అయినా చర్చకు సిద్దమని చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్ చేసారు.

ముఖ్యమంత్రి జగన్ భీమవరం వేదికగా జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంలో జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8,09,039 మంది విద్యార్థులకు రూ.584 కోట్లు జమ చేసారు. బహిరంగ సభలో పవన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏ భార్యతోను ముచ్చటగా మూడు.. నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయ‌ని మ్యారేజ్ స్టార్‌కు చంద్ర‌బాబుతో మాత్రం 10-15 ఏళ్ల బంధం కొనసాగిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేసారు. బాబు కోసమే తన జీవితమని..అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదని..పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని..మరో అభిప్రాయం లేదని చెబుతున్నారని వివరించారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూసామని... ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వారిని ఎప్పుడూ చూసి ఉండమని జగన్ వ్యాఖ్యానించారు.

CM Jagan Made sensational comments over Pawan Kalyan marriages and Alliance with Chandra Babu

చంద్రబాబు సీఎం అయితే చాలు, అదే తనకు వందల కోట్లని దత్తపుత్రుడు భావిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడుకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే అంటున్నారని... ఇవ్వకున్నా ఓకే. త్యాగరాజు దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు. ఆడవాళ్లను ఆటవస్తువులుగా మాత్రమే చూస్తూ..పెళ్లి అనే పవిత్ర వ్యవస్థ సంప్రదాయాన్ని మంట గలుపుతూ పెళ్లిళ్లు - విడాకులు తీసుకుంటున్న పవన్ నాయకుడుకు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. రెండు విషాలు కలిస్తే అమ్రుతం అవుతుందా అని ప్రశ్నించారు. ఈ ఇద్దరి కుటిల నీతిని పేద కుటుంబం, కులం అయినా ఎదిగిందా అని సీఎం వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిగా నాలుగున్నారేళ్లు పాలన చేసిన నాతో ఢీ కొంటున్నారని జగన్ పేర్కొన్నారు. జగన్ కంటే మెరుగైన పాలన చేసాను...తనను గెలిపించండి అని చంద్రబాబు అడగగలరా అని ప్రశ్నించారు.

2014-19 తన ప్రభుత్వంలో ఏం చేసిందో చెప్పి ఓటు అడగగలరా అంటూ నిలదీసారు. కుప్పంలో అయినా సరే.. ఏ ఇంట్లో అయినా సరే..చర్చకు సిద్దమనని ఛాలెంజ్ చేసారు. చంద్రబాబు ఎవరికీ తాను మంచి చేయలేదని తెలుసన్నారు. ఏగ్రామంలో అయినా ప్రతీ అడుగులో గుర్తుకొచ్చేది మీ జగన్ అని వివరించారు. పౌర సేవలు ప్రజల దగ్గరకు తీసుకొచ్చింది మీ జగన్ అంటూ చెప్పుకొచ్చారు. ఎక్కడా వివక్ష లేకుండా పేదల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామన్నారు. వీరంతా వంచన నమ్ముకున్నారన్నారు. అమలు చేసిన మంచి, పథకాలు లేకపోవటంతో మోసాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తనను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+