ఇక కురుక్షేత్రమే, ఇద్దరి మధ్యే పోరాటం - తేల్చేసిన సీఎం జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ మరోసారి చంద్రబాబు,పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికలు కురుక్షేత్ర యుద్దంగా పేర్కొన్నారు. నిరుపేదలు..పెత్తందార్ల మధ్య జరిగే యుద్దంగా అభివర్ణించారు. అన్ని వర్గాల కు..ప్రాంతాలకు మంచి చేసే ప్రభుత్వం..స్కాంలు చేసి దోచుకొనే వాళ్ల మధ్య ఎన్నికల యుద్దం జరగనుందని చెప్పుకొచ్చారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందని నమ్మితే తనకు తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ ప్రజలను అభ్యర్దించారు.

నిధులు విడుదల : ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ వాహనమిత్ర అయిదో విడత నిధులను విడుదల చేసారు. విజయవాడలో లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో 2023-24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదా­రులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఈ సమయంలోనే తన పాలనలో పేదల కోసం అమలు చేసిన పథకాలను వివరించారు.

CM Jagan new Election Slogan to fix Oppostion, releases YSR Vahana Mitra fifth Phase funds

ఇప్పటి వరకు 2.35 లక్షల కోట్ల మేర లబ్ది చేసినట్లు లెక్కలను వెల్లడించారు. వచ్చేది కురుక్షేత్ర యుద్దంగా పేర్కొన్న సీఎం జగన్..ప్రతీ ఇంటికి మంచి చేయాలనే తపనతో పని చేసామన్నారు. పాదయాత్రలో గమనించిన అంశాలకు పరిష్కారంగానే పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పేదల కోసం పని చేసే ప్రభుత్వం..పెత్తందార్ల వైపు నిలబడే ప్రత్యర్ధులతో పోరాటం జరుగుతుందని చెప్పారు.

పేదవాడి ప్రభుత్వం : ఎన్నికల మేనిఫెస్టోల చెప్పిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన చరిత్ర తమకు ఉందన్నారు. వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ గా ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చామన్నారు. ఎస్సీలు..బీసీల పైన అహంకారం..ఖండకావరంతో వ్యవహరించిన వారితో యుద్దం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

పేద విద్యార్ధులకు సీబీఎస్ఈ, ఇంగ్లీషు మీడియం దిశగా చర్యలు ప్రారంభిచామని గుర్తు చేసారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య బ్యాలెన్స్ తప్పుతుందని చెప్పిన వారితో యుద్దం చేస్తున్నామన్నారు. ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్ఢ్ భూములు, అమరావతి పేరుతో దగా, స్కిల్ స్కాం, జన్మభూమి దోపిడి, నీరు చెట్టు పేరుతో దోపిడీ చేసిన వారంతో వివక్ష..అవినీతికి అస్కారం లేకుండా మంచి చేస్తున్న ప్రభుత్వంగా పోరాటం చేస్తున్నామని వివరించారు.

CM Jagan new Election Slogan to fix Oppostion, releases YSR Vahana Mitra fifth Phase funds

ముఖ్యమంత్రి పిలుపు : గత ప్రభుత్వం..ఇప్పటి పాలనకు మార్పు గమనించాలని సీఎం జగన్ సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది పేదలకు మంచి చేయటం కోసం కాదని..దోచుకోవటానికి...పంచుకోవటానికి అధికారం కావాలని చెప్పుకొచ్చారు. తనకు గజదొంగల ముఠా తోడుగా లేదన్నారు. దోచుకోని పంచుకోవటం తన విధానం కాదని సీఎం వివరించారు. తాను నమ్ముకున్నది దేవుడిన..ప్రజలనేని వివరించారు.

వాళ్లు చెబుతున్న అబద్దాలు..మోసాలు నమ్మకండంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇది పేదవాడి ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వివరించారు. కులాలు లేవు, మతాలు లేవని చెప్పిన సీఎం జగన్.. పేదవాడు ఒక వైపు..పెత్తందారు ఒక వైపు వచ్చే ఎన్నికల్లో పోటీ పడుతున్నారని..ప్రతీ అడుగు..ప్రతీ ఓటు కురక్షేత్రంలో పేదవాడిని రక్షించుకొనేందుకేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+