మీదే బాధ్యత - సర్వే నివేదికలు ఇలా : తేల్చి చెప్పిన సీఎం జగన్..!!

రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక మార్గ నిర్దేశం చేసారు. రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి వారికి బాధ్యతలపైన స్పష్టత ఇచ్చారు.

రానున్న ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ కీలక మార్గ నిర్దేశం చేసారు. రీజనల్ కో ఆర్డినేటర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి వారికి బాధ్యతలపైన స్పష్టత ఇచ్చారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. ప్రతీ క్లస్టర్ పరిధిలో ఇద్దరు చొప్పున సారధుల నియమకాలు వెంటనే పూర్తి చేయాలని నిర్దేశించారు. గతంలోనే వీరి నియామకాలకు సంబంధించి స్పష్టత ఇచ్చినా.. ఇంకా పూర్తి చేయకపోవటం పైన సీఎం అసహనం వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేల పని తీరు నివేదికలపైన చర్చ చేసినట్లు సమాచారం. ఇక..ఎన్నికల సమరంలోకి ఎమ్మెల్యేలను కలుపుకుపోతూ రీజనల్ కో ఆర్టీనేటర్లు కీలక బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.

మీరే చొరవ తీసుకోవాలి

మీరే చొరవ తీసుకోవాలి


ముఖ్యమంత్రి జగన్ పార్టీ ప్రాంతీయ సమన్వకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల తీరు..పార్టీ పరంగా కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ భేటీలో సీఎం జగన్ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. సచివాలయ స్థాయిలో పార్టీ సమన్వయకర్తల నియామకం పూర్తి చేయకపోవటం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కో ఆర్డినేటర్లు తమ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు ప్రభుత్వం పైన పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో ఎక్కడైనా నేతల మధ్య సమన్వయంలో సమస్యలు ఉంటే వెంటనే చొరవ తీసుకొని పరిష్కరించేలా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇది ఎన్నికలకు కీలక సమయం

ఇది ఎన్నికలకు కీలక సమయం


ఇదే సమావేశంలో ఇప్పటి వరకు చేసిన సచివాలయ సమన్వయకర్తల నియామకాలకు సంబంధించి ఐప్యాక్ సహా వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. నియోకవర్గాల వారీగా నివేదికలను సంబంధించి రీజనల్ కో ఆర్టినేటర్లకు అందచేసారు. ఎన్నికల దిశగా అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్న వేళ.. రీజనల్ కో ఆర్డినేటర్లు చురుకుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నిర్దేశించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఎమ్మెల్యేలతో మరోసారి గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన వర్క్ షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పని తీరు పైన సర్వే నివేదికల ఆధారంగా హెచ్చరికలు చేసి ఉండటంతో వారి పని తీరు పైన ఆ సమావేశంలో తాజా రిపోర్టులను వెల్లడించనున్నారు. అదే సమయంలో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

సమన్వయం - పని తీరు పై ఫోకస్ చేయండి

సమన్వయం - పని తీరు పై ఫోకస్ చేయండి


జిల్లాలో నేతల మధ్య విభేదాల పరిష్కారంలోనూ రీజనల్ కో ఆర్డినేటర్లు చొరవ తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కో ఆర్డినేటర్ల స్థాయిలో పరిష్కారం కాకుంటే.. రాష్ట్ర నాయకత్వానికి నివేదించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలను నిర్ణయించిన విధంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేసారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు తన నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం విషయంలో మాత్రం రీజనల్ కో ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఎమ్మెల్యేలకు సూచనలు చేయాలని నిర్దేశించారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. మరోసారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+