ఎన్నికల వేళ విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు - గురి అక్కడే...!!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంఛార్జ్ ల మార్పు పైన జగన్ కసరత్తు తుది దశకు చేరింది. ఇప్పటికే అయిదు జాబితాలను ప్రకటించారు. ప్రకటించిన ఇంఛార్జ్ ల్లోనూ కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ బాధ్యుల విషయంలోనూ అలర్ట్ అయ్యారు. టీడీపీ, జనసేన ముఖ్యులు పోటీ చేసే నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా గురి పెట్టారు. అందులో భాగంగా ఎంపీ విజయ సాయిరెడ్డి, చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు.
కీలక నిర్ణయాలు : పార్టీ అభ్యర్దుల ఖరారు సమయంలోనే ముఖ్య నేతలకు సీఎం జగన్ ఎన్నికల బాధ్యతలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ప్రాంతీయ సమన్వయ కర్తలు ఇంఛార్జ్ ల ఎంపికలో కీలకంగా మారారు. టీడీపీ, జనసేన గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గాల్లో ముఖ్య నేతలను జగన్ రంగంలోకి దించుతున్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి సమన్వయకర్తగా ఉన్న పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డికి తాజాగా సీఎం జగన్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు కేటాయించారు. అదే విధంగా ఒంగోలు పార్లమెంట్ తో పాటుగా కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజనల్ కో-ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సాయిరెడ్డికి బాధ్యతలు : గుంటూరు పార్లమెంట్ పరిధిలో సాయిరెడ్డికి బాధ్యతల వెనుక జగన్ కొత్త వ్యూహం కనిపిస్తోంది. గుంటూరు పార్లమెంట్ పరిధిలోనే అమరావతి రాజధాని ప్రాంతం నుంచి. అమరావతి పరిధిలోకి తాడికొండ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల నుంచి టీడీపీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే లోకేష్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలుపును వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాజాగా మంగళగిరిలో పార్టీలో చేరికలు..సామాజిక సాధికారిక సదస్సు నిర్వహణ సమయంలోనే సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. లోకేష్ పైన బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవి వైసీపీ నుంచి పోటీ చేయనున్నారు. బీసీ కార్డు ప్రయోగంతో అక్కడ గెలుపొందాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఆ నియోజకవర్గాలపై గురి : ఇక, మరో ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డికి కీలక నియోజకవర్గాల బాధ్యతలు కేటాయించారు. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి చంద్రగిరి సీటు ఖరారు చేసారు. చెవిరెడ్డి ఈ సారి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఒంగోలుతో పాటుగా కందుకూరు, సంతనూతలపాడు, కావలి నియోజకవర్గాలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమీకరణాల్లో బలమైన నేతకు బాధ్యతలు అవసరమని గుర్తించారు. పార్టీలో సమన్వయం, ఎలక్షన్ నిర్వహణలో చెవిరెడ్డి చురుకుగా ఉంటారనే అభిప్రాయం ఉంది. ఒంగోలు సీటు కోసం కొద్ది రోజులుగా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, అక్కడ చెవిరెడ్డిని దించటం ద్వారా కలిసి వస్తుందనేది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications