ఒక్క ఫోన్ కాల్‌తో మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం - సీఎం జగన్ హామీ..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్‌తో మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతాన‌ని స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి జగన్ కీలక హామీ ఇచ్చారు. ఒక్క ఫోన్ కాల్‌తో మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతాన‌ని స్పష్టం చేసారు. వైయస్‌ఆర్‌ జిల్లా సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌..జిందాల్‌ కంపెనీ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌తో కలి భూమి పూజ చేశారు. 30 నెలల్లోపు స్టీల్‌ ప్లాంట్‌ తొలి దశ పూర్తవుతుందన్నారు. రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. చుట్టు పక్క అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఏ సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కారం చేస్తానంటూ ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ సభా వేదికపై సజ్జన్‌ జిందాల్‌కు హామీ ఇచ్చారు.

రెండేళ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తి

రెండేళ్ల కాలంలో ప్రాజెక్టు పూర్తి

కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ తీసుకురావాలని నాడు వైఎస్సార్ ఆలోచన చేసారని సీఎం జగన్ గుర్తు చేసారు. మరో 24 నెలల నుంచి 30 నెలల లోపు ప్రాజెక్టును పూర్తి చేస్తారని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండు దశల్లో ఈ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు జిందాల్‌ ప్రణాళిక రూపొందించారని వివరించారు. మొదటి ఫేస్‌లో రూ.3,300 కోట్లతో పూర్తిచేస్తారని చెప్పారు. రెండో దశ రూ. 5 వేల కోట్లతో ఐదేళ్లలో పూర్తి చేస్తారని వెల్లడించారు. రూ.8,800 కోట్ల పెట్టుబడులతో మొత్తంగా ఈ ప్రాంతంలో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో..ఒక మంచి వ్యక్తి చేతిలోకి స్టీల్‌ ప్లాంట్‌ వెళ్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సజ్జన్‌ జిందాల్‌ జిందాల్‌ కంపెనీ చైర్మన్‌ దేశంలోనే అగ్రగామీగా స్టీల్‌ జనరేషన్‌లో ఉన్నారని వివరించారు.

చాలా కష్టపడాల్సి వచ్చింది

చాలా కష్టపడాల్సి వచ్చింది

మూడు మిలియన్ టన్నులతో ప్లాంట్ ప్రారంభిస్తున్నారని సీఎం చెప్పారు. అది మరింతగా పెరుగుతుందన్నారు. ఈ ప్లాంట్‌కు సపోర్టు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. ఈప్రాంతం సముద్రతీర ప్రాంతానికి దూరంగా ఉంటుందని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టాలంటే కొంచెం కష్టపడాల్సి వచ్చిందన్నారు. రూ.40 కోట్లతో మిగిలిన భూములన్నీ కొనుగోలు చేశామని... దాదాపు 3500 ఎకరాలు సజ్జన్‌ జిందాల్‌ కంపెనీకి ఇచ్చామని సీఎం వెల్లడించారు. దాదాపు రూ.700 కోట్లతో ఇక్కడ ఇన్‌ఫ్రాక్చర్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ మాత్రమే కాకుండా.. పక్కన ఎకో సిస్టమ్‌ ఏర్పాటవుతుందన్నారు. స్టీల్‌ సిటీ కింద ఈ ప్రాంతం ఆవిర్భవించబోతోందని వెల్లడించారు. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ జాతీయ రహదారిని కలుపుతూ ఏడున్నర కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డును కలుపుతున్నట్లు చెప్పారు.

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

స్టీల్ ప్లాంట్ భూమి పూజ సభలోనే స్థానికంగా జరిగే పనులను సీఎం వివరించారు. ప్రోద్దుటూరు, ఎ్రరగుంట్ల రైల్వే లైన్‌ కోసం కొత్తగా 10 కిలోమీటర్ల రైల్వే లైన్‌ నిర్మాణం జరుగుతోందన్నారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతోందని వివరించారు. నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం తలమంచిలిపల్లి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నుంచి 220 కేవీ లైన్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రకమైన ఇన్‌ఫ్రాక్చర్‌ కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొప్పర్తిలో ఆ క్లస్టర్‌కు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ఇప్పటికే పరిశ్రమలు వస్తున్నాయన్నారు. అక్కడ లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పటికే అక్కడ రూ.1100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ పేరుతో మరో 3155 ఎకరాలను కూడా కేటాయించామని... అక్కడ రూ.18వేల కోట్లతో పెట్టుబడులు వచ్చేలా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తద్వారా లక్ష 75 వేల ఉద్యోగాలు రాబోయే సంవత్సరాల్లో రానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+