జైశంకర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌ - తెలుగు విద్యార్దుల తరలింపుపై: హెల్ప్ లైన్ ఏర్పాటు..!!

ఉక్రెయిన్ పైన రష్యా యుద్దం తో అక్కడ ఉన్న భారతీయులు..తెలుగు విద్యార్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీకి చెందిన విద్యార్ధుల అంశం పైన సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్రం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌కాల్‌ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని సీఎం వెల్లడించారు. తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తరలింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ పొరుగు దేశాల మీదుగా తరలిస్తామని జైశంకర్ వెల్లడించారు.

కేంద్రంతో సీఎం జగన్ సంప్రదింపులు

కేంద్రంతో సీఎం జగన్ సంప్రదింపులు

రాష్ట్ర స్థాయిలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను సీఎంకు వివరించిన అధికారులు.. ఇక, కలెక్టర్ల స్థాయిలో కాల్‌ సెంటర్ల ఏర్పాటుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఇద్దరు అధికారులను ప్రత్యేకంగా నియమించారు. అక్కడ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ తగిన మార్గనిర్దేశం చేయాలి, కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు.

అధికారులకు కీలక సూచనలు

అధికారులకు కీలక సూచనలు

తెలుగువారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఉక్రెయిన్ లో ఏయిర్ స్పేస్ ను నిషేధించటంతో..పొరుగు దేశాలకు విద్యార్ధులను తరలించి..అక్కడ నుంచి భారత్ కు ర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందు కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి జైశంకర్ సీఎం జగన్ తో పంచుకున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక సూచనలు చేసింది.

హెల్ప్ లైన్ ఏర్పాటు

హెల్ప్ లైన్ ఏర్పాటు

ప్రయాణించే కార్లపై భారతీయ జెండాలు ఉంచాలని సూచించారు. హంగేరీ సరిహద్దులకు చేరకొని..అక్కడ నుంచి భారత్ కు తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. ఇక, ఉక్రెయిన్ లోని ఏపీ విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. 24గంటల హెల్ప్​లైన్ నంబర్లు: 0863 2340678(ఫోన్) అందుబాటులో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో భారతీయులను తరలించి..స్వదేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+